Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioFiber Broadband Plans: జియో ఫైబర్‌ కొత్త ప్లాన్స్‌.. మూడు నెలల కాలపరిమితితో కొత్త స్కీమ్స్‌..!

JioFiber Broadband Plans: టెలికాం రంగంలో రిలయన్స్‌ దూసుకుపోతోంది. వినియోగదారులకు బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తూ సత్తా చాటుతోంది. ఇక జియో ఫైబర్‌ తన..

JioFiber Broadband Plans: జియో ఫైబర్‌ కొత్త ప్లాన్స్‌.. మూడు నెలల కాలపరిమితితో కొత్త స్కీమ్స్‌..!
Jio Fiber
Follow us
Subhash Goud

|

Updated on: Sep 09, 2021 | 7:24 PM

JioFiber Broadband Plans: టెలికాం రంగంలో రిలయన్స్‌ దూసుకుపోతోంది. వినియోగదారులకు బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తూ సత్తా చాటుతోంది. ఇక జియో ఫైబర్‌ తన బ్రాడ్‌బ్యాండ్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఇప్పటి వరకు 6, 12 నెలల కాలపరిమితితో కూడిన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను అందించిన జియో.. ఇప్పుడు మూడు నెలల వ్యవధితో కూడిన స్కిమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ప్లాన్లు తీసుకునే పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లు కూడా ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్‌, ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని జియో తెలిపింది.

కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్లు రూ.2,097 నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.25,597 వరకు ఉన్నాయి. అయితే, బేసిక్‌ ప్లాన్‌లో ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉండవు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ ప్లస్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలైవ్‌, జీ5 వంటి ఓటీటీ సేవలు రూ.2,997 ప్లాన్‌తో ప్రారంభమయ్యాయి.

ప్లాన్స్‌ వివరాలు.. ప్రయోజనాలు:

► రూ.2,097 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌కాల్స్‌. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఏమీ లేదు.

► రూ.2,997 ప్లాన్‌: 150 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5

► రూ.4,497 ప్లాన్‌: 300 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా ఉంటుంది. ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు – ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5.

► రూ.7,497 ప్లాన్‌: 500 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు – ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5 ఉన్నాయి.

► రూ.11,997 ప్లాన్‌: 1జీబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు – ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5.

► రూ.25,497 ప్లాన్‌: 1జీబీపీఎస్‌ వేగంతో నెలకు 6,600 జీబీ డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు – ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5.

ఇవీ కూడా చదవండి:

Mobile Apps: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి రికార్డు సృష్టించిన భారత్‌.. గంటలపాటు యాప్స్‌లోనే..

Kisan Vikas Patra: పోస్టాఫీసులో అదిరిపోయే పథకం.. ఇందులో రూ.1 లక్ష పెట్టుబడికి రూ. 2 లక్షలు పొందవచ్చు