AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంట నేర్చుకోమని తల్లి అడ్వైస్.. మనస్తాపంతో కూతురు సూసైడ్.. తెర వెనుక స్టోరీ ఇదే..

అమ్మయిలన్నాక వంటా వార్పు నేర్చుకోవాలంటారు పెద్దలు. అంటే వారికి సహాయం చేస్తారని కాదు. పెళ్లయ్యాక సంసారాన్ని చక్కదిద్దుకుంటారని. అయితే చాలా మంది గారాబంగా సున్నితంగా పెరగడం వల్ల ప్రస్తుత రోజుల్లో...

వంట నేర్చుకోమని తల్లి అడ్వైస్.. మనస్తాపంతో కూతురు సూసైడ్.. తెర వెనుక స్టోరీ ఇదే..
suicide
Ganesh Mudavath
|

Updated on: Jan 23, 2023 | 1:55 PM

Share

అమ్మయిలన్నాక వంటా వార్పు నేర్చుకోవాలంటారు పెద్దలు. అంటే వారికి సహాయం చేస్తారని కాదు. పెళ్లయ్యాక సంసారాన్ని చక్కదిద్దుకుంటారని. అయితే చాలా మంది గారాబంగా సున్నితంగా పెరగడం వల్ల ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలకు వంట చేయడం రావడం లేదు. దీంతో పెళ్లి అయిన తర్వాత అత్త వారింట్లో కష్టాలు పడుతున్నారు. ఈ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వారు కచ్చితంగా వంట చేయడం నేర్చుకోవాల్సిందే. మారుతున్న కాలంలో అబ్బాయిలు కూడా అద్భుతంగా వంట చేస్తున్నారు. స్వయంగా వంట చేసుకోవడం ద్వారా సంతృప్తితో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. కానీ కొందరు మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందనో, నాన్న కోప్పడ్డాడనో.. నిండు జీవితాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది.

తమిళనాడులోని మూనైంచీపట్టి సమీపంలోని గీజాగోడంకుళం ఉత్తర వీధికి చెందిన గుప్పురాజ్.. ఆయన భార్య కనకమణి ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గుప్పురాజ్ గతంలోనే చనిపోయాడు. అతని కుమార్తె క్రిస్టిల్లా మేరీ.. వివాహం ఇటీవల నిర్ణయించారు. ఇందుకోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్రిస్టిలా మేరీ ఇంటి పనులు చేయకుండా తరచూ సెల్ ఫోన్ చూస్తూ ఉండేది. దీంతో ఆమెపై తల్లి కోప్పడింది. ‘నీకు పెళ్లవుతోంది, ముందు వంట నేర్చుకో’ అని సూచించింది.

ఇలా పదే పదే చెబుతుండటంతో క్రిస్టిల్లా మేరీ మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. కూకరైపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి నిశ్చయించుకుని వంట నేర్చుకోమని తల్లి చెప్పడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్