AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: రాజస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు..

Earthquake: రాజస్థాన్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 5.24 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌తో..

Earthquake: రాజస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు..
Earthquake
Shiva Prajapati
|

Updated on: Jul 21, 2021 | 6:52 AM

Share

Earthquake: రాజస్థాన్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 5.24 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌తో పాటు.. ఇతర ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయినట్లు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. కాగా, గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో.. జనాలు హడలిపోయారు.

ఏం జరుగుతుందో అర్థం కాక.. భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు తీశారు. సెకన్ల వ్యవధిపాటు భూమి కంపించగా.. జనాలు తీవ్రంగా భయపడిపోయారు. కాగా, భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రస్తుతం నమోదైన భూకంప తీవ్రతకు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భూకంప అధ్యయన కేంద్రం అధికారులు తెలిపారు.

Also read:

Covid Vaccine: కరోనాపై పోరులో కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి చిన్నారులకు రక్షణ కవచాలుః మంత్రి జితేంద్ర సింగ్

Viral News: సైకిల్‌పై స్టంట్స్.. బ్యాలెన్స్ తప్పింది.. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా! నవ్వకుండా ఉండలేరంతే

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. బుధవారం దేశ వ్యాప్తంగా గోల్డ్‌ రేట్స్‌ ఇలా ఉన్నాయి..