Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. బుధవారం దేశ వ్యాప్తంగా గోల్డ్ రేట్స్ ఇలా ఉన్నాయి..
Gold Price Today: గత కొన్ని రోజులుగా స్థిరంగా లేదా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా మళ్లీ భారీగా పెరిగాయి. కరోనా సమయంలో తులం బంగారం రూ. 50 వేలు దాటి అందరినీ ఆందోళనకు గురి చేసింది. అయితే...
Gold Price Today: గత కొన్ని రోజులుగా స్థిరంగా లేదా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా మళ్లీ భారీగా పెరిగాయి. కరోనా సమయంలో తులం బంగారం రూ. 50 వేలు దాటి అందరినీ ఆందోళనకు గురి చేసింది. అయితే అనంతరం పెరుగుతోన్న బంగారం ధరల నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇక తాజాగా బుధవారం (నేడు) మరోసారి గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. ఒకేరోజు దాదాపు రూ. 300 వరకు పెరగడం గమనార్హం. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో తులం బంగారం రేట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. * దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 47,400 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,710 వద్ద కొనసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 47,300 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,300 గా నమోదైంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ. 45,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 49,370 వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,660 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 49,810 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో బుధవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 45,250 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,370 వద్ద కొనసాగుతోంది. * విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,250 గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,370 గా ఉంది. * విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,250 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 49,370 గా నమోదైంది.
Also Read: Smart Saving Account: ఈ బ్యాంక్ అకౌంట్‌తో అధిక వడ్డీ.. తీసుకోవడం కూడా చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..
IT Returns:పెరిగిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు.. గత ఐదేళ్ళలో ఎంత మంది రిటర్న్స్ దాఖలు చేశారంటే..