Amul Milk: సామాన్యులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. జూలై 1 నుంచి వర్తింపు!
అసలే లాక్‌డౌన్.. ఆపై వస్తోన్న అంతంతమాత్రం జీతాలతో ప్రజలు బ్రతుకు జట్కా బండిని లాగిస్తుంటే.. వారిపై మరో భారాన్ని వేస్తూ గుజరాత్ బేస్డ్ ప్రముఖ పాల..
అసలే లాక్‌డౌన్.. ఆపై వస్తోన్న అంతంతమాత్రం జీతాలతో ప్రజలు బ్రతుకు జట్కా బండిని లాగిస్తుంటే.. వారిపై మరో భారాన్ని వేస్తూ గుజరాత్ బేస్డ్ ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పాలపై రెండు రూపాయలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గుజరాత్ కార్పోరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(GCMMF) అధికారి ఒకరు ప్రకటనను విడుదల చేశారు. రేపట్నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అమూల్ బ్రాంచ్‌లలో ఈ ధరలు అమలులోకి వస్తాయని సంస్థ పేర్కొంది. అమూల్ బ్రాండ్స్ అయిన గోల్డ్, తాజా, శక్తి, తీ-స్పెషల్‌తో పాటు ఆవు, గేదె పాలకు ఈ పెరిగిన రెట్లు వరిస్తాయని చెప్పుకొచ్చింది. ధరల పెంపు పాలు, ఇతర ఉత్పత్తులకు వర్తిస్తుందంది.
అయితే ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, పన్నుల భారంతో ప్రజానీకం సతమతమవుతుంటే.. తాజాగా పాల ధరలు పెరుగుదల వారిని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విమర్శలు వస్తుండగా.. ఆ విమర్శలను అమూల్ సంస్థ తిప్పికొట్టింది. సుమారు ఏడాదిన్నర కాలం తర్వాత పాల ధరలను సవరించామని సంస్థ పేర్కొంది. కాగా, పశువులకు దాణా కొరత, వాటి పోషణ ఖర్చు రెట్టింపు కావడంతో పాడి రైతులు రేట్పాలను పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారని.. అలాగే ప్యాకేజింగ్, రవాణా, ఇంధన ఖర్చులు కూడా పెరిగిపోవడంతో పాల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి చెప్పుకొచ్చారు.
Also Read:
ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..
బిర్యానీ ఇలా కూడా చేస్తారా! నెటిజన్లు ఫిదా.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే!