AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బి చెప్పిన పెళ్లినాటి రహస్యం

బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌, జయ బచ్చన్‌‌ల పెళ్లి వెనుక ఓ పెద్ద కథ ఉంది. ఆ కథకు ఎవరూ ఊహించని మలుపులు.. ట్విస్టులు.. ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వీరి మూడుముళ్ల దాంపత్యానికి (జూన్ 3)నేటితో 46 ఏళ్లు ముగిసి.. 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అమితాబ్ తన పెళ్లినాటి ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే వివాహనానికి కారణమైన ఓ సంఘటన గురించి ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. ‘జూన్ 3, 1973.. […]

బిగ్ బి చెప్పిన పెళ్లినాటి రహస్యం
Sanjay Kasula
|

Updated on: Jun 03, 2020 | 5:18 PM

Share

బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌, జయ బచ్చన్‌‌ల పెళ్లి వెనుక ఓ పెద్ద కథ ఉంది. ఆ కథకు ఎవరూ ఊహించని మలుపులు.. ట్విస్టులు.. ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వీరి మూడుముళ్ల దాంపత్యానికి (జూన్ 3)నేటితో 46 ఏళ్లు ముగిసి.. 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అమితాబ్ తన పెళ్లినాటి ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే వివాహనానికి కారణమైన ఓ సంఘటన గురించి ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.

‘జూన్ 3, 1973.. 47 సంవత్సరాల క్రితం.. సరిగ్గా ఈ రోజు… ‘జంజీర్’ చిత్రం భారీ విజయం సాధించడంతో సంబరాలు చేసుకునేందుకు జయ, కొద్దిమంది స్నేహితులతో లండన్‌ వెళ్లాలనుకున్నాం. లండన్‌కు వెళ్లడానికి జూన్ 3 తేదీ అర్ధరాత్రి ఫ్లయిట్. అప్పటికే టికెట్లు కూడా బుక్ అయ్యాయి.  ఈ విషయాన్ని ముందుగా నాన్న హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌కు చెప్పాను. ఎవరితో వెళుతున్నావని నాన్న అడిగారు. జయతో అని చెప్పినప్పుడు.. నువ్వు ముందు ఆమెను పెళ్లి చేసుకో ఆ తరువాత లండన్‌ వెళ్లండి. లేకపోతే వెళ్లకండి అన్నారు. ఇక మా తండ్రి మందలింపుతో చేసేది ఏమీ లేక వెంటనే పూజారులను పిలిచాము. అప్పటికప్పుడు సమీప బంధువులకు సమాచారం అందించాము. పెళ్లి దుస్తుల్లో మలబార్ హిల్స్‌కు స్వయంగా కారు నడుపుకొంటూ వెళ్లాలని డోర్ తీయగానే.. మా డ్రైవర్ నన్ను పక్కకు జరిపి తను డ్రైవ్ చేస్తానని అన్నాడు. ఎలాగు పెళ్లిలో గుర్రం ఎక్కడం లేదు కదా అని మలబారు హిల్స్‌కు కారును పరుగులు తీయించాడు. మలబార్ హిల్స్‌లో మా వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే ఉన్నట్టుండి పెద్ద వర్షం కురిసింది. ఇది శుభసూచకమని పెద్దలు ఆశీర్వదించారు అని అమితాబ్ రాసుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి లండన్‌కు బయలుదేరాం’. 50 ఏళ్ళ సినీ జీవితంలో 47 ఏళ్ల సినీ జీవితం అంటూ రాసుకున్నారు బిగ్ బి.

అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ మొదట 1972లో ‘బన్సీ బిర్జు’లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత అభిమాన్‌, ఏక్‌ నజర్‌‌తోపాటు చాలా చిత్రాల్లో కలిసి నటించారు.

Follow Us
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు