AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రూ.10 వేలతో దేశ పర్యటన.. యువతి ఛాలెంజ్.. 6 రాష్ట్రాలకైన ఖర్చు ఎంతంటే?

దేశమంతా చుట్టి రావాలంటే వేల రూపాయలు ఖర్చవుతాయి. రైలు టికెట్లు, భోజనం, వసతి ఖర్చులు ఉంటాయి. కానీ ఓ యువతి రూ.10 వేల బడ్జెట్‌తో దేశమంతా చుట్టేయాలని ప్లాన్‌ చేసింది. ఇప్పటివరకు ఆరు రాష్ట్రాలను సందర్శించింది. ఇప్పటిదాకా ఖర్చు చేసింది కేవలం రూ. 2 వేలే. యువతి ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video: రూ.10 వేలతో దేశ పర్యటన.. యువతి ఛాలెంజ్.. 6 రాష్ట్రాలకైన ఖర్చు ఎంతంటే?
Woman Challenges Travel Across India With Just Rs 10,000
Sharada V
|

Updated on: Nov 03, 2026 | 6:50 PM

Share

ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రయాణ విశేషాలను ఈ యువతి పంచుకుంటోంది. దేశమంతా తిరిగేందుకు ఆమెకు రూ.10 వేల బడ్జెట్ మాత్రమే ఉంది. చాలామంది ఒక ప్రాంతానికి వెళ్లి రావడానికి రూ.10 వేలు ఖర్చు చేస్తారు. కానీ తాను మాత్రం అదే మొత్తంతో భారతదేశాన్ని చుట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంది . రూ.2 వేలు మాత్రమే ఖర్చు చేసి ఆరు రాష్ట్రాలను సందర్శించింది . అయితే తన ప్రయాణం ఇంకా చాలా మిగిలి ఉందని, రూ.10 వేలతో దేశమంతా తిరగడం సాధ్యమవుతుందో లేదో తనకే తెలియదని చెప్పింది. చేతిలో ఉన్న డబ్బులు అయిపోతే తన ఛాలెంజ్ కూడా అక్కడితో ముగుస్తుందని తెలిపింది. చివరకు ఈ సవాలును పూర్తి చేయగలనా? లేదా? అన్నది చూడాలని తన ఫాలోవర్లను కోరుతోంది.

ఉచితంగా భోజనం.. రైల్వే స్టేషన్లలోనే బస!

ఇంత తక్కువ బడ్జెట్‌తో ప్రయాణం ఎలా సాధ్యమవుతుందన్న సందేహం చాలామందికి రావచ్చు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న వీడియోలు కొంత సమాధానం ఇస్తున్నాయి. ప్రయాణ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉచితంగా భోజనం అందించాలని కోరుతోంది. రైళ్లు ఆలస్యమైన సందర్భాల్లో రైల్వే స్టేషన్లలోనే ఉండాల్సి వచ్చిన విషయాలను కూడా వీడియోల్లో పంచుకుంది. ఇలా అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

యువతి సాహసంపై నెటిజన్ల భిన్న స్పందనలు

ఈ యువతి ఛాలెంజ్‌పై సోషల్ మీడియాలో కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రోత్సహిస్తున్నారు. మరికొందరు మాత్రం ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ‘జాగ్రత్తగా ఉండు.. నువ్వు చాలా బాగా చేస్తున్నావు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రయాణానికి ఎంచుకునే రవాణా మార్గం, వసతి, ఆహారంపై ఖర్చు ఆధారపడుతుంది. దేవాలయాలు, గురుద్వారాల్లో ఉచిత భోజన సదుపాయాలను ఉపయోగించుకోవాలని, తక్కువ ఖర్చుతో ప్రయాణించే రవాణా మార్గాలను ఎంచుకోవడం, అందుబాటులో ఉన్న చౌకైన వసతుల్లో ఉండటం ద్వారా డబ్బు ఆదా చేయవచ్చని తెలిపారు. రూ.10 వేలతో దేశమంతా తిరగడం సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు. రైలు టికెట్లు, భోజనం, బస ఖర్చులకే ఆ మొత్తం సరిపోదని ఒక యువతి ఒంటరిగా దేశమంతా తిరుగుతున్నప్పుడు భద్రత, రాత్రిపూట బస వంటి ఎలా నిర్వహిస్తుందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేవలం రూ.10 వేలతో భారతదేశాన్ని చుట్టేయాలన్న ఈ యువతి ఛాలెంజ్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆరు రాష్ట్రాలు తిరిగేందుకు రూ.2 వేలే ఖర్చు చేసిన ఆమె.. మిగిలిన దేశాన్ని కూడా ఇదే బడ్జెట్‌లో చూడగలదా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Follow Us
రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?
రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?
పూరీలు, బజ్జీలు వేయించిన నూనె నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పూరీలు, బజ్జీలు వేయించిన నూనె నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. ఈ విలన్ ఎలా చనిపోయారంటే?
మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. ఈ విలన్ ఎలా చనిపోయారంటే?
ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్
ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్
ఎన్నో తప్పులు చేశా.. ఏళ్ల కష్టం తర్వాతే ఆ విషయం అర్థమైంది
ఎన్నో తప్పులు చేశా.. ఏళ్ల కష్టం తర్వాతే ఆ విషయం అర్థమైంది
పాము విషం నుంచి మనిషి ప్రాణాలను కాపాడుతున్నది ఈ జంతువే..
పాము విషం నుంచి మనిషి ప్రాణాలను కాపాడుతున్నది ఈ జంతువే..
శోభనం సీన్.. నేను బెడ్‌పైకి వెళ్లగానే ఆ హీరోయిన్ ఏడ్చేసింది
శోభనం సీన్.. నేను బెడ్‌పైకి వెళ్లగానే ఆ హీరోయిన్ ఏడ్చేసింది
భారత్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
భారత్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
వైభవ్, హర్షిత్‌కు మరో ఛాన్స్.. ఈసారి లెక్క సరిచేస్తారా?
వైభవ్, హర్షిత్‌కు మరో ఛాన్స్.. ఈసారి లెక్క సరిచేస్తారా?
భర్తకు శాపం.. OTT టాప్ ట్రెండింగ్ లో మిస్టరీ థ్రిల్లర్ సిరీస్
భర్తకు శాపం.. OTT టాప్ ట్రెండింగ్ లో మిస్టరీ థ్రిల్లర్ సిరీస్