Amit Shah: అవసరమైతే నాకు ఫోన్ చేయండి.. కాశ్మీర్‌లో సాధారణ పౌరుడికి ఫోన్ నెంబర్ ఇచ్చిన అమిత్ షా
Amit Shah Jammu Kashmir Tour: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇటీవల ప్రాంతీయేతరులను లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మైనార్టీలు, వలస కార్మికులు 11 మందికిపైగా
Amit Shah Jammu Kashmir Tour: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇటీవల ప్రాంతీయేతరులను లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మైనార్టీలు, వలస కార్మికులు 11 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడుల అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్‌లో మూడు రోజులు పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అమిత్ షా సరిహద్దు గ్రామాల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాని.. ప్రజల భద్రతే తమకు ముఖ్యమని.. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధే తమ నినాదమంటూ భరోసానిచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా.. పాక్ సరిహద్దుకు సమీపంలోని మక్వాల్ గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో ముచ్చటించారు. అంతే కాదు.. తన మొబైల్ నంబర్‌ను ఒక సాధారణ పౌరుడికి ఇచ్చి.. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు.. తనకు ఫోన్ చేయండి. అండగా నిలుస్తామంటూ భరోసానిచ్చారు. ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదని.. సాధారణ ప్రజల భద్రతే తమ లక్ష్యమంటూ షా పేర్కొన్నారు. అంతేకాకుండా సైనికులతో కూడా ప్రత్యేకంగా ముచ్చటించారు. ఎలాంటి ఆందోళన లేకుండా.. దేశానికి సేవ చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భద్రతా సిబ్బందిని అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. అమిత్ షా మక్వాల్ నివాసితులతో ప్రత్యేకంగా సంభాషించారు. గ్రామంలోని ఇళ్లను పరిశీలించి.. మంచం మీద కూర్చుని నివాసితులతో మాట్లాడారు. ఈ సమయంలో ఓ ప్రత్యేక సన్నివేశం చోటుచేసుకుంది. గ్రామస్థులతో షా చెబుతుండగా.. గ్రామస్థుడు తనకు సమస్యలను వివరించబోయాడు.. ఈ క్రమంలో అతనికి తన మొబైల్ నంబర్ ఇచ్చి.. మీరు నాకు ఫోన్ చేయండి అంటూ చెప్పారు.
#WATCH | J&K: Union Home Minister Amit Shah takes the contact number of a local resident of Makwal border in Jammu, shares his own and tells him that the man can contact him whenever he needs.
The Home Minister visited the forward areas of Makwal border today. pic.twitter.com/KJnI9zEsSD
— ANI (@ANI) October 24, 2021
అమిత్ షా స్నేహ హస్తం.. కశ్మీర్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా కేంద్ర హోంమత్రి అమిత్ షా శ్రీనగర్‌లో ప్రసంగించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్‌ను తొలగించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మీరంతా.. మీమీ మనస్సులోనుంచి భయాన్ని తొలగించుకోండి. కాశ్మీర్ శాంతి, అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. ఈ విషయంపై కొందరు తనను తరచుగా ఆటపట్టించేవారని.. దూషించేవారని పేర్కొన్నారు. ప్రజలతో స్వేచ్ఛగా సంభాషించాలనుకుంటున్నానని.. అందుకే బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ లేకుండా మీ మధ్యకే వచ్చానంటూ స్నేహ హస్తం అందించారు. ఉగ్రవాదులు కశ్మీర్ లోయలోని యువతను తప్పుదోవ పట్టించే పని చేస్తున్నారని.. వారికి ఆయుధాలు, రాళ్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యువత మంచి మార్గంలో నడవాలని.. జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధి కోసం పాటుపడాలని షా సూచించారు.
పాకిస్థాన్‌పై ఆగ్రహం.. మీకు రాళ్లు ఇచ్చిన వారు ఏమైనా మేలు చేశారా అంటూ కశ్మీర్ యువతను అమిత్ షా ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీకు దగ్గరగా ఉంది. ఆయా గ్రామాల్లో కరెంటు ఉందా అని అడగండి అంటూ సూచించారు. ఇంకా.. ఆసుపత్రి ఉందా? మెడికల్ కాలేజీ ఉందా..? గ్రామానికి తాగునీరు అందుతుందా..? మహిళలకు మరుగుదొడ్లు ఉన్నాయా? అంటూ ప్రశ్నలు సంధించారు. అక్కడ మంచి ఏమీ జరగలేదని.. కానీ అలాంటి వారిని పాకిస్తాన్ అణిచివేసి.. యువతను తప్పుదారి పట్టిస్తుందంటూ మండిపడ్డారు.
ఇంటర్నెట్ సేవలను ఎందుకు నిలిపివేయాలి? ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై అమిత్ షా మాట్లాడారు. ఇంటర్నెట్‌ను బంద్ చేయకపోతే యువతను రెచ్చగొట్టే పనిలో కొంత మంది ఉంటున్నారని.. ఇలాంటి తప్పుడు సమాచారంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు. ఇప్పుడు కాశ్మీర్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి మనస్సులో కశ్మీర్ ఉందని.. ఆయన గట్టి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కాశ్మీర్ అభివృద్ధికి అడ్డుపడుతున్న వారి ఆశయాలు నెరవేరవంటూ.. అమిత్ షా తీవ్రవాద సంస్థలు, ప్రత్యర్థులకు హెచ్చరించారు.
Also Read: