AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh: నాకు కాదు కరోనా.. లోపలున్నవాడికి.. అంబులెన్స్ ఆపి చెరకురసం కోసం వచ్చిన ఆరోగ్య కార్యకర్త!

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక వైపు కరోనా కేసులు పెరిగిపోతోనే ఉన్నాయి. పరిస్థితి ఇంత విషమంగా ఉన్నాసరే.. ప్రజల్లో మాత్రం ఇంకా సరైన అవగాహన రావడం లేదు.

Madhya Pradesh: నాకు కాదు కరోనా.. లోపలున్నవాడికి.. అంబులెన్స్ ఆపి చెరకురసం కోసం వచ్చిన ఆరోగ్య కార్యకర్త!
Madhya Pradesh
KVD Varma
|

Updated on: Apr 09, 2021 | 2:07 PM

Share

Madhya Pradesh: కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక వైపు కరోనా కేసులు పెరిగిపోతోనే ఉన్నాయి. పరిస్థితి ఇంత విషమంగా ఉన్నాసరే.. ప్రజల్లో మాత్రం ఇంకా సరైన అవగాహన రావడం లేదు. సాధారణ ప్రజలను పక్కన పెడితే వారికి మంచీ చెడూ చెప్పాల్సిన వైద్య శాఖలో సేవలు అందిస్తున్న వారే నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఒక్కోసారి వారు చేస్తున్న పనులకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇదిగో ఈ సంఘటన సరిగ్గా అలాంటిదే. రోడ్డుపక్కనే ఉన్న చెరకురసం బండి.. చాలా మంది అక్కడ చెరకురసం కోసం ఉన్నారు. ఇంతలో ఓ అంబులెన్స్ వచ్చింది. అందులోంచి పీపీటీ కిట్ వేసుకుని ఉన్న ఓవ్యక్తి దిగి చెరకురసం ఆర్డర్ ఇచ్చి లైనులో నుంచున్నాడు. అక్కడ ఉన్నవారికి మతిపోయింది. ఏమిటి బాబూ అంబులెన్స్ లో ఎవరున్నారో అని ఆరా తీశారు. కరోనా పేషేంట్ అని చెప్పిన ఆ వ్యక్తి.. కరోనా అందులో ఉన్న పేషేంట్ కి నాకు కాదు. అంటూ ధీమాగా సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని షాదోల్ జిల్లాలో చోటు చేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న చెరకురసం బండి వద్ద ఆగిన అంబులెన్స్ లో కరోనా పేషేంట్ ఉన్నాడు. ఇంకా అంబులెన్స్ లో ఇద్దరు పీపీటీ కిట్లు ధరించి ఉన్నారు. ఒక పీపీటీ కిట్ వేసుకున్న హెల్త్ వర్కర్ తనకు చెరకు రసం కావాలని అడుగుతున్నాడు. అంతేకాదు ఆ సమయంలో అతని మాస్క్ గెడ్డం మీదకు వచ్చి ఉంది. అక్కడే ఉన్న వ్యక్తి అతనిని కరోనా పేషేంట్ ను తీసుకెళుతూ ఇలా ఎనుదుకు ఆగవు అని అడిగితె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇంతలో వీడియో తీస్తున్నారని తెలియగానే.. తన మాస్క్ ను సరి చేసుకున్నాడా హెల్త్ వర్కర్.. కరోనా గురించి.. నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వారే నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ వేగంగా కరోనా విస్తరిస్తున్న రాష్ట్రంగా ఉంది. దేశంలో 84 కేసులు నమోదు అవుతున్న పది రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒకటి. ఇక్కడ మొత్తం 3,41,887 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 54,000 మంది మరణించారు.

Also read: Covid 19 Pandemic: మన రక్షణ మనచేతుల్లోనే ఉంది.. తలలు వెనక్కి జరిపి.. మాస్కులు ధరించండి..ఆనంద్ మహీంద్రా ట్వీట్

Rahul Gandhi: వ్యాక్సినేషన్ తో ‘పండగ’ చేసుకోవడం కాదు.. రాష్ట్రాలకు సక్రమంగా పంపండి..రాహుల్ గాంధీ  తీవ్ర వ్యాఖ్యలు