Jaya : బర్త్ డే వేళ నెట్టింట్లో అడ్డంగా బుక్కైపోతున్న జయాబచ్చన్, ఎంతటి దురహంకారమంటూ తీవ్రమైన ట్రోలింగ్

Jaya Bachchan : ఇవాళ జయాబచ్చన్ బర్త్ డే. నెట్టింట్లో శుభాకాంక్షలు చెప్పాల్సిందిపోయి, నెటిజన్లు తీవ్రంగా ఆమెను..

Jaya : బర్త్ డే వేళ నెట్టింట్లో అడ్డంగా బుక్కైపోతున్న జయాబచ్చన్, ఎంతటి దురహంకారమంటూ తీవ్రమైన ట్రోలింగ్
Jaya
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 09, 2021 | 3:17 PM

Jaya Bachchan : ఇవాళ జయాబచ్చన్ బర్త్ డే. నెట్టింట్లో శుభాకాంక్షలు చెప్పాల్సిందిపోయి, నెటిజన్లు తీవ్రంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఎంతటి అహంకారం, దురహంకారం, ఏమా మొరటుతనం, అదే ఒక మగ నేత అలా చేసిఉంటే, ఏంజరిగేది అంటూ ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు ఆటేడేసుకుంటున్నారామెను. ఇంతకీ ఏంటీ కథామకామిషు అంటే.. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం మమతా బెనర్జీకి మద్దతుగా టీఎంసీ పార్టీ అభ్యర్థి తరపున హౌరాలో శుక్రవారం రోడ్ షో నిర్వహించారు జయ బచ్చన్. అయితే, ఆ సమయంలో జయ ఉన్న వాహనం ఎక్కి నిల్చున్నాడో వ్యక్తి. దీంతో పట్టలేని ఆగ్రహానికి గురైన ఆమె, అతడ్ని చేత్తో కిందకి నెట్టింది. ఇదే ఆమె చేసిన అపరాధమైంది. ఒక వ్యక్తి ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే, ఇంతటి పొగరా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లమీద కామెంట్లు పెడుతున్నారు జనం. ఇంతకీ అక్కడ అసలేంజరిగిందో ఈ దిగువ వీడియోలో..

Read also :  పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న చిన్నారులు, 10 ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు