Madhya Pradesh Cabinet: మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ విస్తరణ.. కొత్త వారికి అవకాశం దక్కేనా..?

Madhya Pradesh Cabinet: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం మంత్రివర్గ విస్తరణ ...

Madhya Pradesh Cabinet: మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ విస్తరణ.. కొత్త వారికి అవకాశం దక్కేనా..?
Follow us
Subhash Goud

|

Updated on: Jan 01, 2021 | 8:41 PM

Madhya Pradesh Cabinet: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. గత ఏడాదిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శివరాజ్‌సింగ్‌.. మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది మూడోసారి. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం అనంతరం ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ మహ్మద్‌ రఫిక్‌ 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాగా, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న యూపీ గవర్నర్‌ ఆనంద్‌ బెన్‌ పటేల్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది. మహ్మద్‌ రఫిక్‌ గతంలో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. డిసెంబర్‌ 31న ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.

గత సంవత్సరం నవంబర్‌ 3న మధ్యప్రదేశ్‌ లో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ 19 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని నిలబెట్టుకుంది. అప్పటి నుంచి పార్టీ తరపున విజయం సాధించిన వారు మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కేబినెట్‌లో కొత్త వారికి చోటు దక్కుతుందా..? లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మరోసారి మంత్రి వర్గం విస్తరిస్తుండటంతో వారికి స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నారు.

Also Read:

Kerala Elephant: 50 అడుగుల లోతైన బావిలో పడిపోయిన ఏనుగు.. బయటకు తీసేందుకు అధికారుల ప్రయత్నాలు

Prisoners List: భారత్‌, పాకిస్థాన్‌ జైల్లో మగ్గుతున్న ఖైదీల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న ఇరు దేశాలు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!