Kerala Elephant: 50 అడుగుల లోతైన బావిలో పడిపోయిన ఏనుగు.. బయటకు తీసేందుకు అధికారుల ప్రయత్నాలు
Kerala Elephant: ఓ ఏనుగు 50 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. ఏనుగును గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ...
Kerala Elephant: ఓ ఏనుగు 50 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. ఏనుగును గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో శుక్రవారం రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని ఏనుగును కాపాడే చర్యలు చేపట్టారు.
ఓ వ్యక్తికి చెందిన ఆ బావి గట్టును పగులగొట్టి ఏనుగును బయటకు తీసే విధంగా తవ్వకాలు చేపట్టారు. అయితే ఏనుగు కొన్ని రోజుల కిందటనే బావిలో పడి గాయపడి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగును బయటకు తీసిన తర్వాత దాని ఆరోగ్య పరిస్థితిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: Prisoners List: భారత్, పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న ఖైదీల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న ఇరు దేశాలు