AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెలగపూడి అక్రమాల చిట్టా విప్పిన విజయసాయి. రంగాను కత్తితో పొడిచిన హత్య చేసిన వాళ్ళలో వెలగపూడి ఒకరని వ్యాఖ్య

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మొత్తం ఒక పుస్తకమే తెరిచారు. టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు..

వెలగపూడి అక్రమాల చిట్టా విప్పిన విజయసాయి. రంగాను కత్తితో పొడిచిన హత్య చేసిన వాళ్ళలో వెలగపూడి ఒకరని వ్యాఖ్య
Venkata Narayana
|

Updated on: Jan 01, 2021 | 9:41 PM

Share

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మొత్తం ఒక పుస్తకమే తెరిచారు. టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నేర చరిత్ర చిట్టాను బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఒక రేపిస్ట్, హంతకుడు వెలగపూడి అంటూ మొదలు పెట్టిన విజయసాయి, వెలగపూడి రామకృష్ణ తండ్రి బ్రహ్మస్వరావు అవినీతి పరుడు అంటూ రంగంలోకి దిగారు. ఇంకా విజయసాయి వెలగపూడి గురించి ఏమంటున్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. ” వంగవీటి రంగ హత్య కేసులో నిందితుడు, విజయవాడ నుంచి విశాఖ కు పారిపోయి వచ్చిన వ్యక్తి. ఇంటర్ పరీక్షలు కూడా ఆయన సోదరుడు దేవగుడి ఆదినారాయణ సహాయంతో కాపీకొట్టిన రాసిన వ్యక్తి వెలగపూడి. ఏజీ బి.ఎస్పీ పాస్ కాలేదు.. ఒక విశ్వ విద్యాలయం నుంచి పట్టా కొనుగోలు చేశాడు. వెలగపూడి విద్యార్హత పై త్వరలో ఒక కేసు కూడా పడుతుంది. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో కమర్షియల్ కాంప్లెక్స్, ఇళ్ళు ఉన్నాయి. విశాఖ లో బినామీ పేర్లతో ఇళ్ళు ఉన్నాయి. వెలగపూడి బినామీలు.. బైరెడ్డి పోతన్న రెడ్డి, కాళ్ల శంకర్, పట్టాభి, రాజేంద్ర కుమార్, సతీష్. వెలగపూడి బినామీలూ జాగ్రత్తగా ఉండాలి. వెలగపూడి రాగమాలిక అనే సి.డి షాప్ అడ్డాగా చేసుకుని రంగ హత్య ప్లాన్ చేశారు. రాగమాలిక రామకృష్ణ అని మొదట పిలిచేవారు. రంగా ను కత్తి తో పొడిచిన హత్య చేసిన వాళ్ళలో వెలగపూడి ఒకరు. విశాఖపట్నం కు బ్రతుకుతెరువు కోసం వచ్చి ఈనాడు పత్రికలో పనిచేశారు. విశాఖలో లిక్కర్ సిండికేట్ అక్రమాలు. దేవినేని బాజీ, పేరుతో కబడ్డీ పోటీలు పెట్టి కలెక్షన్లు చేసిన వ్యక్తి వెలగపూడి. రజకులకు చెందిన భూమి లాక్కొని అతని బినామీ పట్టాభి తో ఆక్రమణ. ఏసీపీ రంగ రావుకు లంచం ఇచ్చి రౌడీ షీట్ తీయించుకున్నాడు. సర్వే 2/1 600 గజాలు భూమి ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు.? వెలగపూడి యువజన పేరుతో ఆరిలోవ లో అక్రమాలు, విధి నిర్వహణ లో ఉన్న ఎస్.ఐ ను గాయపరిచిన కేసులో నిందితుడు. ఋషికొండలే అవుట్లో రెండు ప్రభుత్వ ఫ్లాట్ లు కొట్టేశాడు.” అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అవినీతి, అక్రమాల చిట్టా విప్పారు. విశాఖలో ఇంతటి అవినీతి పరుడుని ఎందుకు గెలిపిస్తున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అంటూ ప్రజల్ని అడిగిన విజయసాయి. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ కార్పొరేషన్ అభ్యర్థులు ని గెలిపించాలని కోరుతున్నానని వెల్లడించారు.