zombie reddy movie : గద పట్టుకొని జాంబీలతో పోరాటానికి సిద్ధమైన తేజ సజ్జ
'అ' సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ''జాంబీ రెడ్డి'' అనే వైవిధ్యమైన చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

zombie reddy movie : ‘అ’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ”జాంబీ రెడ్డి” అనే వైవిధ్యమైన చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆనంది – దక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర యూనిట్ ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ అంటూ ట్రైలర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని న్యూ ఇయర్ న్యూ రూల్స్ అంటూ కొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఇక ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఇక తాజాగా గా విడుదల చేసిన పోస్టర్ లో హీరో తేజ సజ్జా చేతిలో గద పట్టుకొని ఉండగా.. ఆనంది త్రిసూలం మరియు దక్ష గన్ పట్టుకొని జాంబీలతో పోరాటానికి సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ‘జోంబీ రెడ్డి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.




