AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Dia Mirza : ఒక్కసారి తెలుగు నేర్చుకుంటే పూర్తిగా మర్చిపోలేం అంటున్న బాలీవుడ్ బ్యూటీ

కింగ్ నాగార్జున త్వరలో వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అహిషోర్‌ సోలమన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్  ఇటీవలే పూర్తి అయ్యింది.

Actress Dia Mirza : ఒక్కసారి తెలుగు నేర్చుకుంటే పూర్తిగా మర్చిపోలేం అంటున్న బాలీవుడ్ బ్యూటీ
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2021 | 9:12 PM

Share

actress dia mirza : కింగ్ నాగార్జున త్వరలో వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అహిషోర్‌ సోలమన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. వైల్డ్‌ డాగ్‌ అనేది ఓ యాక్షన్‌ ఫిల్మ్‌. గతంలో కూడా యాక్షన్‌ మూవీల్లో భాగమయ్యా. కానీ ఈ మూవీలో వెరీ డ్రామటిక్‌ అండ్‌ ఎమోషనల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నా. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగా. స్కూల్లో తెలుగు నేర్చుకున్నా. నాకు ఆరవ తరగతి వరకు తెలుగు రాయడం, చదవడం వచ్చు. తెలుగు ఉన్నగొప్పతనం ఏంటంటే దాన్ని మనం ఒకసారి నేర్చుకుంటే పూర్తిగా మర్చిపోలేం అంటూ చెప్పుకొచ్చింది. స్కూల్లో నేర్పిన ఓ తెలుగు కవిత నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. ఈ కవితను సెట్స్‌లో గుర్తు చేసుకుంటూ బట్టిబడుతుంటే అందరూ నన్ను  చూసి నర్సరీ పిల్లల చదువుతుంది అని నవ్వుతున్నారని తెలిపింది దియా.

also read : zombie reddy movie : గద పట్టుకొని జాంబీలతో పోరాటానికి సిద్ధమైన తేజ సజ్జ