Virat Anushka: ఇంట్లో సేఫ్‌గా న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్న విరుష్క జంట.. ‘ఇంతకు మించింది ఇంకేముంది’..

Virat Anushka New Year: భారతదేశంలో టాప్‌ సెలిబ్రిటీ జంటల్లో అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లి ఒకరు. చూడముచ్చటగా కనిపించే ఈ జంట కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు...

Virat Anushka: ఇంట్లో సేఫ్‌గా న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్న విరుష్క జంట.. 'ఇంతకు మించింది ఇంకేముంది'..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 01, 2021 | 9:08 PM

Virat Anushka New Year: భారతదేశంలో టాప్‌ సెలిబ్రిటీ జంటల్లో అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లి ఒకరు. చూడముచ్చటగా కనిపించే ఈ జంట కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ప్రేమ పక్షుల్లా విహరిస్తుంటారు. గతేడాది న్యూఇయర్‌ వేడుకులకు చక్కర్లు కొట్టిన జంట తాజాగా మాత్రం ఇంట్లోనే వేడుకలను జరుపుకున్నారు. దీనికి కారణం అనుష్క పండంటి బిడ్డకు జన్మనివ్వనుండడమే.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

అందులోనూ కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో ఈ జంట ఇంట్లోనే సేఫ్‌గా న్యూఇయర్‌ వేడుకలు జరుపుకున్నారు. వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్న విరాట్ కోహ్లి… వాటితో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్‌ను కూడా జోడించాడు. క్రికెటర్‌ హార్ధిక్‌ పాండే అతని భార్యతో పాటు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్నేహితులతో గ్రూప్ ఫొటోతో పాటు అనుష్కతో దిగిన సింగిల్ ఫొటోను పోస్ట్‌ చేసిన విరాట్‌.. ‘కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన స్నేహితులతో.. పాజిటివ్‌ సమయాన్ని గడిపాం. సురక్షితమైన వాతావరణంలో స్నేహితులతో గడపడం కంటే మించింది ఏదీ లేదు. ఈ ఏడాది అందరికీ కొత్త ఆశల్ని, సంతోషాల్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చాడు.

Also Read: Celebrity Couples New Year Wishes: జంటగా న్యూఇయర్‌ శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు..