శ్రీవారి ఆలయంపై శిలువ గుర్తు పెట్టారంటూ సోషియల్ మీడియాలో దుష్ప్రచారం చేసినవాళ్లు అరెస్ట్: ధర్మారెడ్డి
తిరుమల శ్రీవారి ఆలయంపై శిలువ గుర్తు పెట్టారంటూ సోషియల్ మీడియాలో దుష్ప్రచారం చేసినవారిని పోలీసులు అరెస్ట్ చేశారని..

Tirumala Tirupati Devasthanams
తిరుమల శ్రీవారి ఆలయంపై శిలువ గుర్తు పెట్టారంటూ సోషియల్ మీడియాలో దుష్ప్రచారం చేసినవారిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి. శ్రీవారి ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆలయంపై విద్యుత్ అలంకరణ తొలగించడంపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. పోలీసులకు ఆధారాలు ఇవ్వడానికి శ్రీవారి ఆలయంపై పూర్ణకుంభం ఆకృతిని తొలగించి కొత్త అలంకరణ ఏర్పాటు చేశామన్నారు. టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులెవ్వరూ నమ్మకూడదని ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.
