AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RMP Doctor Murder Case: ఆదోని పరువు హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇనుప రాడ్లు, బండరాయి స్వాధీనం

RMP Doctor Murder Case: కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం సంచలన సృష్టించిన పరువు హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ....

RMP Doctor Murder Case: ఆదోని పరువు హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇనుప రాడ్లు, బండరాయి స్వాధీనం
Subhash Goud
|

Updated on: Jan 01, 2021 | 9:00 PM

Share

RMP Doctor Murder Case: కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం సంచలన సృష్టించిన పరువు హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో పోలీసులు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన ఆడమ్‌ స్మిత్‌ అనే వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఆడమ్‌స్మిత్‌ ఆర్‌ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నాడు. అయితే నెలన్నర రోజుల కిందట అదే గ్రామానికి చెందిన మళ్లీశ్వరిని ప్రేమించిపెళ్లి చేసుకున్నాడు.

వివాహం అయినప్పటి నుంచి ఆదోని విట్టా కిష్టప్ప నగర్‌లో ఉంటున్న వైద్యుడి .. ఆదోనిలోని ఓ నర్సింగ్‌ హోంలో పని చేస్తున్నాడు. రోజువారీగా ఆడమ్‌ స్మిత్‌ బైక్‌పై నర్సింగ్‌ హోంకు వెళ్తుండగా, కొందరు దుండగులు అటకాయించి బండరాయితో తలపై మోది హత్య చేశారు.

అయితే ప్రేమ వివాహం చేసుకున్నామనే కారణంతో భర్తను నా కుటుంబ సభ్యులే హత్య చేశారని భార్య మళ్లీశ్వరి ఆరోపిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తులో మహేశ్వరి తండ్రి చిన్న ఈరన్న, పెద్దనాన్న పెద్ద ఈరన్నలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు ఆడమ్‌ స్మిత్‌ను తామే హత్య చేశామని విచారణలో ఇద్దరు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసు నమోదు చేశారు. నిందితులను శనివారం ఆదోని కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. ఆడమ్‌ స్మిత్‌ను హత్య చేసేందుకు ఉపయోగించని ఇనుపరాడ్లు, బండరాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Also Read: Thugs Attack: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. పది మంది దుండగుల హల్‌చల్‌.. గొంతు కోసి ఒకరి హత్య