ఏపీలో హోంమంత్రి ఏంచేస్తున్నారు.? .. లేని పక్షంలో త్వరలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. సోము వీర్రాజు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ లో నిరంతరాయంగా దేవాలయాలపై దాడులు జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఏంచేస్తున్నారని..
ఆంధ్రప్రదేశ్ లో నిరంతరాయంగా దేవాలయాలపై దాడులు జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఏంచేస్తున్నారని నిలదీశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇలాంటి దుశ్చర్యలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించడం చూస్తుంటే వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునని ఆయన సంశయం వ్యక్తం చేశారు. నిన్న (డిసెంబర్ 31వతేదీ) రాత్రి రాజమండ్రిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసంతో పాటు గతంలోనూ రాష్ట్రంలోని అనేక దేవాలయాలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. వీటిపై ప్రజాగ్రహం పెల్లుబిక్కకముందే పరిస్థితులను చక్కదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులు చేస్తున్న దోషులను కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో త్వరలో @BJP4Andhra ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.
నిన్న రాత్రి రాజమండ్రిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం మరియు ఇలా నిరంతరాయంగా దేవలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి సుచరిత గారు జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించడం చూస్తుంటే .. (1/2) pic.twitter.com/zJKdoAkHsD
— Somu Veerraju (@somuveerraju) January 1, 2021