ఉన్నావ్ కేసు..యూపీ అసెంబ్లీ వద్ద అఖిలేష్ యాదవ్ ధర్నా

యూపీలో మహిళలపై పెరిగిపోతున్న నేరాలకు నిరసనగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం లక్నోలోని అసెంబ్లీ వద్ద ధర్నా చేశారు. ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి మృతిని ప్రస్తావించిన ఆయన.. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రితో బాటు రాష్ట్ర హోం కార్యదర్శి, డీజీపీ కూడా రాజీనామా చేయాలని, అప్పటివరకు బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగదని అఖిలేష్ పేర్కొన్నారు. ఉన్నావ్ ఘటనకు […]

ఉన్నావ్ కేసు..యూపీ అసెంబ్లీ వద్ద అఖిలేష్ యాదవ్ ధర్నా
Follow us
Pardhasaradhi Peri

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 5:50 PM

యూపీలో మహిళలపై పెరిగిపోతున్న నేరాలకు నిరసనగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం లక్నోలోని అసెంబ్లీ వద్ద ధర్నా చేశారు. ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి మృతిని ప్రస్తావించిన ఆయన.. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రితో బాటు రాష్ట్ర హోం కార్యదర్శి, డీజీపీ కూడా రాజీనామా చేయాలని, అప్పటివరకు బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగదని అఖిలేష్ పేర్కొన్నారు. ఉన్నావ్ ఘటనకు నిరసనగా తాము రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సంతాప సభలు నిర్వహిస్తామన్నారు. ఈ ఘటన అత్యంత దారుణమైనదని, ఈ బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదని చెప్పారు. మృగాళ్లను కాల్చి చంపుతామని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఒక కూతురి ప్రాణాలను రక్షించ లేకపోయారని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. అటు-తెలంగాణాలో దిశ కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. ఈ రేప్-మర్డర్ కేసులో ఓ కుటుంబానికి న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. న్యాయ పరిధి నుంచి నిందితులు ఎంత దూరం తప్పించుకు వెళ్తారని వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా.. ఉన్నావ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పరామర్శించారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి.. ఇలాంటి ఘటనలను అదుపు చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.