AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఊరిలో మగ.. ఆ ఊరిలో ఆడ..! ఏం చేస్తాడంటే..!

బతుకుదెరువు కోసం.. పలువురు పలు రకాలైన పనులు చేస్తూంటారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. చదువుకున్నవారైతే బిజినెస్‌లు, కొన్ని రకాల జాబ్స్, లేక చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూంటారు. ఇక మరికొందరి పరిస్థితి అయితే.. అధ్వాన్నంగా ఉంటుంది. ఈ కోవలోకే మధురైలోని ఓ వ్యక్తి చేరుతాడు. ఓ వ్యక్తి ఆరునెలలుగా.. మహిళలా చీరకట్టుకుని ఇళ్లల్లో పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అసలు విషయం బయటకు […]

ఈ ఊరిలో మగ.. ఆ ఊరిలో ఆడ..! ఏం చేస్తాడంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 07, 2019 | 5:49 PM

Share

బతుకుదెరువు కోసం.. పలువురు పలు రకాలైన పనులు చేస్తూంటారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. చదువుకున్నవారైతే బిజినెస్‌లు, కొన్ని రకాల జాబ్స్, లేక చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూంటారు. ఇక మరికొందరి పరిస్థితి అయితే.. అధ్వాన్నంగా ఉంటుంది. ఈ కోవలోకే మధురైలోని ఓ వ్యక్తి చేరుతాడు. ఓ వ్యక్తి ఆరునెలలుగా.. మహిళలా చీరకట్టుకుని ఇళ్లల్లో పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

మధురైలోని శివగంగై జిల్లాకి చెందిన మానామదురైలో రాజా(40) అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా ఇంటి పనులు చేస్తున్నాడు. ఇతను నివసించేది శివగంగై జిల్లాలో.. కానీ.. అక్కడి నుంచి రాజర్ రోడ్డు తెప్పకుళం అనే ప్రాంతానికి వెళ్లి పనిచేస్తుంటాడు. సొంత జిల్లాలో.. లుంగీ, ప్యాంటు, షర్డుతో తిరిగే ఈ వ్యక్తి.. తెప్పకుళం వెళ్లేసరికి.. ఆడ వేషంలో దర్శనమిస్తూంటాడు.

ఆ ప్రాంతంలోని.. మూడు ఇళ్లల్లో.. రాజా పనిచేస్తూంటాడు. తను ఒప్పుకున్న ఇళ్లల్లో రాజాత్తిగా పేరుమార్చుకున్నాడు. కాగా.. తాను బట్టలు మార్చుకున్నట్లు తీసిన ఫొటోలు వైరల్‌గా మారడంతో.. ఇది పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో.. రాజాను పోలీసులు విచారించారు.

అయితే.. తనకు మానామదురైలో పని దొరకలేదని.. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను పెంచుకోవడం కోసం.. ఈ అవతారం ఎత్తాల్సి వచ్చిందని అతను పేర్కొన్నాడు. నా మాట.. నడవడిక.. అంతా మహిళలా ఉండటంతో.. ఆ ఇళ్ల యజమానులకు ఎలాంటి అనుమానం రాలేదని రాజా తెలిపాడు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా