పెరిగిన తాజ్‌మహల్ ఎంట్రీ ఫీజు..! షాక్‌లో పర్యాటకులు

మరోసారి తాజ్‌మహల్ ఎంట్రీ ఫీజును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పెంచారు. దీంతో.. పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఏడు వింతల్లో తాజ్‌మహల్ ఒకటి. నదీ తీరాన ఉన్న దాని అందాలను చూడటానికి.. ప్రపంచ వ్యాప్తంగా.. టూరిస్టులు ఆగ్రాకు చేరుకుంటారు. ఇప్పటికే తాజ్ మహల్ ఎంట్రీ ఫీజును పలుమార్లు అధికారులు పెంచారు. ఇప్పుడు తాజాగా.. తాజ్‌మహల్ పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి. భారతీయులు పగలు చూడాలనుకుంటే.. రూ.220, అలాగే.. విదేశీయులకు.. రూ.520లుగా నిర్ణయించారు. ఇక […]

పెరిగిన తాజ్‌మహల్ ఎంట్రీ ఫీజు..! షాక్‌లో పర్యాటకులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 5:53 PM

మరోసారి తాజ్‌మహల్ ఎంట్రీ ఫీజును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పెంచారు. దీంతో.. పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఏడు వింతల్లో తాజ్‌మహల్ ఒకటి. నదీ తీరాన ఉన్న దాని అందాలను చూడటానికి.. ప్రపంచ వ్యాప్తంగా.. టూరిస్టులు ఆగ్రాకు చేరుకుంటారు. ఇప్పటికే తాజ్ మహల్ ఎంట్రీ ఫీజును పలుమార్లు అధికారులు పెంచారు.

ఇప్పుడు తాజాగా.. తాజ్‌మహల్ పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి. భారతీయులు పగలు చూడాలనుకుంటే.. రూ.220, అలాగే.. విదేశీయులకు.. రూ.520లుగా నిర్ణయించారు. ఇక అర్థరాత్రి తాజ్ మహల్ అందాలు చూడాలంటే.. 12 గంటలకు ఓపెన్ చేస్తారు. దీనికి సెపరేట్ టికెట్ ఉంటుంది. భారతీయులకు అయితే.. రూ.510, విదేశీయులకు.. రూ.750లుగా టికెట్ ధరను నిర్ణయించారు. సాధారణంగా.. ఉదయం 7 నుంచి 10 గంటలు.. అలాగే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తాజ్ మహల్‌లోకి ప్రవేశం ఉంటుంది.