బిగ్ బాస్: టాటూ చెప్పిన కథ.. ఒక రాధ.. ఇద్దరు కృష్ణులు!

బిగ్ బాస్: టాటూ చెప్పిన కథ.. ఒక రాధ.. ఇద్దరు కృష్ణులు!

సెలబ్రిటీల లవ్ స్టోరీస్ కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి.. కొన్ని ప్రేమలు.. పెళ్లి పీటల వరకు వెళ్తే..  కొన్ని టాటూలుతో ఆగిపోయి.. చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. దీనికి నిదర్శనం సౌత్ లేడి సూపర్‌స్టార్ నయనతారను తీసుకోవచ్చు. దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు.. నయన్ చేతికి ‘P’ అనే టాటూ వేయించుకుంది. అయితే ప్రస్తుతం విగ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన నయన్.. పాత జ్ఞాపకాలను చెరిపేయడానికి చాలా ఇబ్బందులు పడిందనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు సరిగ్గా ఇలాంటి […]

Ravi Kiran

| Edited By:

Dec 07, 2019 | 7:39 PM

సెలబ్రిటీల లవ్ స్టోరీస్ కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి.. కొన్ని ప్రేమలు.. పెళ్లి పీటల వరకు వెళ్తే..  కొన్ని టాటూలుతో ఆగిపోయి.. చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. దీనికి నిదర్శనం సౌత్ లేడి సూపర్‌స్టార్ నయనతారను తీసుకోవచ్చు. దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు.. నయన్ చేతికి ‘P’ అనే టాటూ వేయించుకుంది. అయితే ప్రస్తుతం విగ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన నయన్.. పాత జ్ఞాపకాలను చెరిపేయడానికి చాలా ఇబ్బందులు పడిందనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు సరిగ్గా ఇలాంటి టాటూ కథ ఒకటి బాలీవుడ్ జంటను తరుముతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

బీ-టౌన్‌ జంట పరాస్ చాబ్రా, ఆకాంక్ష పూరిల గురించి నార్త్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆకాంక్ష పూరి ఇటీవల విశాల్ నటించిన ‘యాక్షన్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తన మాజీ ప్రియుడు పరాస్ చాబ్రాపై ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న పరాస్, షెహనాజ్ గిల్‌తో లవ్‌లో ఉన్నాడు. ఒకానొక సందర్భంలో వీరిద్దరి మధ్య పరాస్ గత ప్రేమ విషయాల గురించి చర్చ జరగ్గా..  మాజీ ప్రేయసి ఆకాంక్ష పూరితో నడిచిన ప్రేమ విషయంపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తనకు, ఆకాంక్షకు మధ్య ఓ బలవంతపు సంబంధం ఉండేదని.. అది తనకు అసలు ఇష్టం లేదని పేర్కొన్నాడు.

దీనిపై ఆకాంక్ష స్పందిస్తూ.. పరాస్‌ తన ప్రేమను, తనతో ఉన్న సంబంధాన్ని ఒక జోక్‌గా చిత్రీకరిస్తాడని అనుకోలేదని చెప్పింది. అంతేకాకుండా పరాస్ కోసం తను ఇష్టంగా టాటూను వేయించుకుంటే.. దాన్ని సైతం అవమానించాడని వాపోయింది. ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో మగ తోడు అవసరమే లేదని తెలిపింది. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత పరాస్ తన ప్రేమపై ఇలాంటి బూటకపు కథ అల్లుతాడని ఎప్పుడో ఊహించానని ఆకాంక్ష చెప్పుకొచ్చింది.

మరోవైపు సిద్ధార్థ్ శుక్లాతో గతంలో నడిచిన ఎఫైర్ గురించి కూడా ఆకాంక్ష పూరి పెదవి విప్పింది. పరాస్‌తో డేట్‌కు వెళ్ళకముందు వరకు సిద్ధార్థ్‌తో తనకు మంచి రిలేషన్ ఉండేది. ఎప్పుడైతే పరాస్‌ను ఇష్టపడ్డానో.. అప్పుడే సిద్ధార్థ్‌ని కలవడం మానేశాను. అయితే సిద్ధార్థ్‌ను కొన్ని విషయాల్లో మధ్యలోకి తీసుకొచ్చి.. పరాస్ తనతో గొడవ పడేవాడని ఆకాంక్ష పూరి తెలిపింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu