Jammu Kashmir: విమానం ఆకారంలో బెలూన్.. భారత్-పాక్ సరిహద్దులో కలకలం.. తీరా చూస్తే..
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ‘పీఐఏ’ పేరుతో ఉన్న బెలూన్ విమానం తీవ్ర కలకలం రేపింది.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ‘పీఐఏ’ పేరుతో ఉన్న బెలూన్ విమానం తీవ్ర కలకలం రేపింది. జమ్మూలోని కనాచక్ ప్రాంతంలో పంట పొలాల్లో ‘పీఐఏ’(పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్) పేరుతో ఉన్న బెలూన్ విమానం పడింది. దానిని గమనించిన స్థానికులు.. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాంబ్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని ఆందోళనకు గురయ్యారు. ఆ బెలూన్ విమానానికి దూరంగా వెళ్లిన ప్రజలు.. దానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బెలూన్ విమానాన్ని పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. చివరికి ఏమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఆ బెలూన్ విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇలాంటి బెలూన్ విమానం దొరకడం ఇది మూడవ సారి అని అక్కడి అధికారులు చెబుతున్నారు. మార్చి 10, 16వ తేదీల్లో హిరానగర్ సెక్టార్‌లోని సోత్రా చక్ గ్రామంతో పాటు.. జమ్మూలోని భల్వాల్ ప్రాంతంలో ఇలాంటి బెలూన్లనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also read:
Horoscope Today: ఈరోజు ఈ రాశివారి ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.. అందుకు ఏం చేయాలంటే..