Silver Price Today: పరుగులు పెడుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతమేర పెరిగిందంటే..?

Silver Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు, వెండి ధరలు ఒక రోజూ తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతున్నాయి. దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పు, చేర్పులు

Silver Price Today: పరుగులు పెడుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతమేర పెరిగిందంటే..?
Silver Price Today
Follow us

|

Updated on: Mar 30, 2021 | 4:46 AM

Silver Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు, వెండి ధరలు ఒక రోజూ తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతున్నాయి. దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బంగారం ధరలు తగ్గగా.. వెండి ధర పెరిగింది. నిన్న రూ. 64,700 లు ఉన్న కిలో వెండి ధర.. మంగళవారం 65,700లకు పెరిగింది. అంటే దాదాపు వేయి రూపాయలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,700 ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.65,700 ఉంది.  చెన్నైలో రూ.69,300 ఉండగా, బెంగళూరులో రూ.65,700 వద్ద ఉంది. ఇక కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.65,700 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో వెండి కిలో రూ.69,300 ఉంది. విజయవాడలో రూ.69,300 లుగా కొనసాగుతోంది.

బంగారం.. ఇదిలాఉంటే.. దేశంలో 10 గ్రాముల బంగారంపై స్వల్పంగా ధర తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సుమారు 200లు తగ్గి రూ.41,700 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.45,490 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.41,700 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 45,490 వద్ద కొనసాగుతోంది. కాగా, దేశీయంగా పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, అంతర్రాష్ట్రీయ సమస్యలు వంటి పలు అంశాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల కాలంలో.. బంగారం, వెండి ధరలు కొన్ని రోజులు పెరుగుతుంటుంటే.. మరికొన్ని రోజులు తగ్గుతుండటం విశేషం.

Also Read:

Gold Price Today: ఈ రోజు స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Myanmar Refugees: ఆ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొద్దు.. మణిపూర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే