Viral: రైతు పొలం దున్నుతుండగా బయటపడిన వింత వస్తువులు.. అవేంటో తెలిసి షాక్
ఈనెల 10న ఓ రైతు తన వ్యవసాయ భూమిని చదునుచేస్తుండగా పురాతన వస్తువులు కనిపించాయి. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మెయిన్‌పురి జిల్లా(Mainpuri district)లో కురవాలి మండలం గణేశ్‌పుర గ్రామంలో ఈనెల 10న బహదూర్ సింగ్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమి దున్నుతుండగా.. పురాతన వస్తువులు కనిపించాయి. దీంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) అధికారుల రంగంలోకి దిగి తనిఖీలు చేయగా… 4వేల ఏళ్లనాటి పురాతన వస్తువులు బయటపడ్డాయి. వారంపాటు అక్కడ శాస్త్రీయ పరిశోధనలు చేసిన అనంతరం… దాదాపు 77 రాగి వస్తువులను, కుండలు, వంట కొలిమిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 3 రకాల కత్తులతోపాటు ఈటెలు, 16 మానవ బొమ్మలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. వాటిని ల్యాబ్‌కు తీసుకెళ్లి.. రసాయనాలతో క్లీన్ చేసి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాటిలోని రాగి వస్తువుల స్వచ్ఛత 98 శాతం వరకు ఉంటుందని వెల్లడించారు. వాటి సైజ్, ఆకృతి ఆధారంగా పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు మరిన్ని పరిశోధనలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాగి వస్తువులు దొరికిన చాల్కోలిథిక్ కాలం నాటివి అని పరిశోధకులు ప్రాథమికంగా చెబుతున్నారు. వస్తువులు దొరికిన ప్రాంతంలో గతంలో సైనికుల శిబిరం ఉండేదని అనుమానిస్తున్నారు. క్రీస్తుపూర్వం1800 నుంచి క్రీస్తుపూర్వం 1500 మధ్య ఇక్కడ సైనికులు నివసించి ఉంటారన్నది శాస్త్రవేత్తల అంచనా. వీరు గారిక్ కుండల సంప్రదాయానికి సంబంధించిన ప్రజలు అయి ఉంటారని.. వారి కాలంలో ప్రజలు రాగితో చేసిన ఆయుధాలను ఉపయోగించేవారని చెబుతున్నారు. కాగా మెయిన్‌పురిలో గతంలో కూడా 9, 10వ శతాబ్దానికి చెందిన పురాతన వస్తువులను గుర్తించారు అధికారులు.
మరిన్ని జాతీయ వార్తలపై క్లిక్ చేయండి..