Gold, Silver Prices: ఈ వారం మెరుపు తగ్గిన బంగారం.. భారీగా పడిపోయిన వెండి ధరలు.. ఎంతంటే?
ఈ పతనం తర్వాత, బంగారం దాని ఆల్ టైమ్ గరిష్టం నుంచి దాదాపు రూ. 5,371లకు తగ్గింది. ఆగస్ట్ 2020లో బంగారం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో పది గ్రాముల బంగారం..
ఈ వారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అయితే, బంగారం ధర కంటే వెండి ధర ఎక్కువగా పడిపోవడం గమనార్హం. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్‌లో ఈ వారం వెండి రూ.1,700 కంటే ఎక్కువ తగ్గింది. ఈ వారం ప్రారంభంలో అంటే జూన్ 20న కిలో వెండి రూ.61,067 వద్ద ఉండగా, ప్రస్తుతం జూన్ 25న కిలో వెండి రూ.59,350కి తగ్గింది. అంటే ఈ వారం వెండి ధర రూ.1,717 తగ్గింది. బంగారం గురించి మాట్లాడితే, ఈ వారంలో దీని ధర రూ. 233 తగ్గింది. జూన్ 20న 10 గ్రాముల బంగారం ధర రూ.51,064 వద్ద ఉండగా, ప్రస్తుతం అది రూ.50,829కి తగ్గింది.
ఆల్ టైమ్ హై కంటే తక్కువ ధర..
ఈ పతనం తర్వాత, బంగారం దాని ఆల్ టైమ్ గరిష్టం నుంచి దాదాపు రూ. 5,371లకు తగ్గింది. ఆగస్ట్ 2020లో బంగారం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో పది గ్రాముల బంగారం రూ.56,200 స్థాయికి చేరుకుంది. అదే సమయంలో, వెండి గరిష్ట స్థాయి నుంచి కిలోకు రూ. 20,630 తగ్గడం విశేషం. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో వెండి ధర రూ.79,980గా ఉంది.
రుతుపవనాల ప్రభావంతో..
ఈ సంవత్సరం రుతుపవనాలు మెరుగ్గా ఉంటే, రాబోయే కాలంలో బంగారం కొనుగోలు పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం వినియోగం కూడా పెరుగుతుందని, ఇది దాని ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ఖరీదైనదిగా మారుతుందని భావిస్తున్నారు. వెండికి పారిశ్రామిక డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఇది రాబోయే కాలంలో దాని ధరలను మరోసారి పెంచేందుకు దోహదపడుతుందని అంటున్నారు.
మిస్డ్ కాల్‌తో బంగారం ధర ఇట్టే తెలుసుకోవచ్చు..
ఇంట్లో కూర్చొని బంగారం, వెండి ధరను సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. దీంతో మీరు బంగారం, వెండి తాజా ధరలను తనిఖీ చేసుకోవచ్చు.