లవర్‌ని కలిసేందుకు భారీ స్కెచ్.. పేరెంట్స్‌కు హింటిచ్చి మరీ ఉడాయించిన యువతి.. కట్‌చేస్తే..

24 ఏళ్ల అమ్మాయి పేరు ఫిజా ఖాన్.. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఉంటుంది. ఈ అమ్మాయి పాకిస్థాన్ వెళ్లేందుకు వీసా కూడా రెడీ చేసుకుంది. అయితే ఆమె పాకిస్థాన్ వెళ్లేలోపే..

లవర్‌ని కలిసేందుకు భారీ స్కెచ్.. పేరెంట్స్‌కు హింటిచ్చి మరీ ఉడాయించిన యువతి.. కట్‌చేస్తే..
Madhya Pradesh Girl
Follow us
Venkata Chari

|

Updated on: Jun 25, 2022 | 5:37 PM

సోషల్ మీడియాలో చిగురించిన స్నేహంతో.. ప్రేమలో పడిన ఓ అమ్మాయి.. తన లవర్‌ను కలుసుకునేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇందుకోసం వీసా, పాస్‌పోర్ట్ కూడా తయారు చేసుకుంది. ఇంట్లో హింట్ ఇచ్చి మరీ, తన లవర్‌ను కలుసుకునేందుకు బయల్దేరింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసి పోలీసులే అవాక్కయ్యారు. అసలేంటా ఆ కథ అని తెలుసుకుకోవాలని ఉందా? అక్కడికే వస్తున్నాం.. తన బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి పాకిస్థాన్ వెళ్తున్న యువతిని అట్టారీ సరిహద్దులో పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 24 ఏళ్ల అమ్మాయి పేరు ఫిజా ఖాన్.. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందినది. ఈ అమ్మాయి పాకిస్థాన్ వెళ్లేందుకు వీసా కూడా రెడీ చేసుకుంది. అయితే ఆమె పాకిస్థాన్ వెళ్లేలోపే ఆమె పేరు మీద లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయింది. దీంతో కస్టమ్‌ డిపార్ట్‌మెంట్‌, బీఎస్‌ఎఫ్‌ అధికారులు బాలికను అట్టారీ సరిహద్దుల్లో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికను తిరిగి తీసుకెళ్లేందుకు రేవా పోలీసులు అమృత్‌సర్ చేరుకుని, తల్లిదండ్రులకు అప్పగించారు.

పాస్‌పోర్ట్‌తో తన ఇంటి నుంచి పారిపోయిన ఈ ఎంపీ అమ్మాయి.. జూన్ 14న కుటుంబ సభ్యులు రేవా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బయటకు వచ్చింది. ఇంట్లో పాస్‌పోర్ట్ లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే ఫిజాపై పోలీసుల ద్వారా లుక్ అవుట్ సర్క్యులర్‌ను జారీ చేయించారు. దీంతో ఆమె విదేశాలకు వెళ్లకుండా చేశారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు .. సోషల్ మీడియాలో ఫిజా పాకిస్థాన్ యువకుడు దిల్షాద్‌తో ప్రేమలో పడింది. దిల్షాద్ కోరిక మేరకు, ఫిజా పాస్‌పోర్ట్ కూడా రెడీ చేసుకుంది. చాలా సార్లు ఆమె తన కుటుంబ సభ్యులకు కూడా పాకిస్థాన్ వెళ్తానంటూ చెప్పింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యలు అంతగా పట్టించుకోలేదు. తీరా ప్రేమ మత్తులో పడి ఆమె ఇంటి నుంచి పారిపోవడంతో కుటుంబ సభ్యులకు అసలు విషయం ఆలస్యంగా అర్థమైంది.

జూన్ 14న ఫిర్యాదుతో వెలుగులోకి..

ఇవి కూడా చదవండి

ఫిజా పాకిస్తాన్ పారిపోయిందని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఇంట్లో ఫిజా పాస్‌పోర్ట్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిజాపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయించారు. ఈ క్రమంలో పాకిస్థాన్ వెళ్లేందుకు ఫిజా అట్టారీ సరిహద్దుకు చేరుకోగా.. కస్టమ్స్ శాఖ అధికారులు పట్టుకున్నారు. శనివారం ఉదయం అమృత్‌సర్ రూరల్ పోలీసుల పరిధిలోని ఘరిండా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఫిజాను రేవా పోలీసులకు అప్పగించారు. ఫిజా రేవాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. రెండు నెలల క్రితమే పాస్‌పోర్టు తయారు చేసుకుంది. ఆ తర్వాత పాకిస్థాన్‌ వెళ్లేందుకు వీసా కూడా తీసుకుంది.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో