Delta Variant: డెల్టా వేరియంట్ తీవ్రం కాకముందే అలెర్ట్ కావాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. తక్షణమే సమగ్ర వ్యూహం అవసరమని వ్యాఖ్య
ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ఉధృతం కాకముందే, పరిస్థితి తీవ్రం కాక ముందే అన్ని దేశాలు అప్రమత్తం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మొదట ఇండియాలో కనుగొన్న ఈ వేరియంట్ త్వరితగతిన వ్యాపిస్తోంది, అప్పుడే 132 దేశాలకు వ్యాప్తి చెందిందని పేర్కొంది.
ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ఉధృతం కాకముందే, పరిస్థితి తీవ్రం కాక ముందే అన్ని దేశాలు అప్రమత్తం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మొదట ఇండియాలో కనుగొన్న ఈ వేరియంట్ త్వరితగతిన వ్యాపిస్తోంది, అప్పుడే 132 దేశాలకు వ్యాప్తి చెందిందని పేర్కొంది. ఈ కారణంగా దీని అదుపునకు మనకు సమగ్ర వ్యూహం అవసరమని ఈ సంస్థ హెడ్ ట్రెడ్రోస్ ఆద్నాన్ సూచించారు. ఇప్పటివరకు 4 వేరియంట్లను నిపుణులు కనుగొన్నారని, వైరస్ వ్యాపించే కొద్దీ మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. శుక్రవారం మీడియాసమావేశంలో మాట్లాడిన ఆయన.. తమ సంస్థ పరిధిలోని ఆరు దేశాలకు గాను అయిదు దేశాల్లో ఇన్ఫెక్షన్లు గత 4 వారాలుగా 80 శాతం పైగా పెరిగాయన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.. ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న గేమ్ ప్లాం వర్కౌట్ అవుతోంది. కానీ ఇది చాలదు.. దీన్ని మరింత సమర్థంగా అమలు చేయాల్సి ఉంది అని ఆయన వివరించారు.
వ్యాక్సిన్ల సరఫరాలో సమతుల్యత కొరవడిందని ఆయన అభిప్రాయపడ్డారు. పేద దేశాలకు ఇంకా సరిపడినన్ని టీకామందులు లభ్యం కావడం లేదని, ధనిక దేశాలు తమవద్ద వ్యాక్సిన్ ని నిల్వ ఉంచుకుంటున్నాయని ఆయన అన్నారు. సెప్టెంబరు మాసాంతానికి ప్రతి దేశం తమ జనాభాలో 10 శాతం, వచ్చే ఏడాది జులై నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ అవసరమన్నారు.కాగా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని, ఇది ఇంకా పెరగాల్సి ఉందని ఏఎఫ్పీ వార్తా సంస్థ పేర్కొంది. ఏమైనా.. అన్ని దేశాలూ పటిష్టమైన, సరైన ఫలితాలనిచ్చే వ్యూహం చేపట్టాలని, మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటింపు ఇప్పటికీ తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ సూచించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Food Emergency: అన్నమో రామచంద్రా అంటున్న పాక్‌లోని ఆ ప్రాంత ప్రజలు.. లక్షలాదిమంది మరణించే ప్రమాదం