AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేక్షకుల భారీ ఆదరణలో నంబర్ 1.. దూసుకుపోతోన్న టీవీ9 నెట్‌వర్క్.. మీడియాలో సరికొత్త చరిత్ర..

BARC (www.barcindia.co.in) రేటింగ్‌లో TV9 న్యూస్ ఛానెల్ తన పోటీదారులందరినీ అధిగమించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు 74 వారాల తర్వాత వచ్చిన రేటింగ్స్‌లో ఛానెల్‌ మాత్రమే కాదు.. మొత్తం టీవీ9 నెట్‌వర్క్‌ కూడా మొదటి స్థానానికి చేరుకుంది.

ప్రేక్షకుల భారీ ఆదరణలో నంబర్ 1.. దూసుకుపోతోన్న టీవీ9 నెట్‌వర్క్.. మీడియాలో సరికొత్త చరిత్ర..
Tv9 Network
Venkata Chari
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 18, 2022 | 11:15 AM

Share

హిందీ వార్తా జానర్‌లో కొత్త ఆవిర్భావాన్ని అదిమి పట్టడానికి 74 వారాల పాటు సాగిన ప్రయత్నాలు ఫలించలేదు. TV9 Bharatvarsh దేశంలో అత్యధికంగా వీక్షించే జాతీయ హిందీ వార్తా ఛానెల్‌గా అవతరించింది. టీవీ9 భారత్‌వర్ష్ నంబర్ వన్ ఛానెల్‌గా మారింది. మార్చి 17, 2022 విడుదల చేసిన BARC ( www.barcindia.co.in ) రేటింగ్‌లో.. TV9 న్యూస్ ఛానెల్ దాని పోటీదారులందరినీ అధిగమించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు 74 వారాల తర్వాత వచ్చిన రేటింగ్స్‌లో ఛానెల్‌ మాత్రేమ కాదు.. మొత్తం టీవీ9 నెట్‌వర్క్‌ కూడా మొదటి స్థానానికి చేరుకుంది. TV9 Bharatvarshని జాతీయ హిందీ వార్తా ఛానెళ్ల లిస్టులో 16.8 % మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిపింది. ఈ చారిత్రాత్మక సందర్భంగా టీవీ9 నెట్‌వర్క్ సీఈవో బరున్ దాస్ వీక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మా టీమ్ పూర్తి అంకితభావంతో కష్టపడి పనిచేశాం. దీనితో పాటు మాకు ఇంత ప్రేమను అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని బరున్ దాస్ పేర్కొన్నారు.

అలాగే తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో ఛానెల్స్‌ను నడుపుతున్న TV9 నెట్‌వర్క్.. దేశంలోనే అతిపెద్ద టెలివిజన్ న్యూస్ నెట్‌వర్క్‌గా తన ర్యాంక్‌ను కాపాడుకుంది. టీవీ9 నెట్‌వర్క్ 292 మిలియన్ల ఏఎంఏని సాధించింది. 13 ఛానెల్‌లతో సమీప పోటీదారుగా ఉన్న జీ నెట్‌వర్క్ కంటే ఇది 25 శాతం ఆధిక్యంలో నిలిచింది.

అయితే, హిందీ న్యూస్ జానర్‌లో 14.8% మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో నిలిచిన ఆజ్‌తక్‌ నిలిచింది. హిందీలో  20 సంవత్సరాల క్రితం ప్రారంభమైన AajTak .. అప్పటి నుంచి అగ్రగామిగా ఉంటూ వస్తోంది. TV9 Bharatvarsh తన మూడో వార్షికోత్సవంలోపే (మార్చి 31) ఇంతటి అపూర్వమైన విజయం సాధించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ మహమ్మారి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఎన్నో సంచలన కథనాలతో TV9 Bharatvarsh అద్భుతమైన కవరేజీని అందించింది. దీంతో రేటింగ్‌ల నిచ్చెనపై టీవీ9 నెట్‌వర్క్ ర్యాకింగ్ నిరంతరం పెరుగుతూనే ఉంది.

ఈ సందర్భంగా న్యూస్ డైరెక్టర్ హేమంత్ శర్మ మాట్లాడుతూ .. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకెంతో సాధించాల్సి ఉంది. మా ప్రేక్షకుల కోసం అదే ఉత్సాహంతో పని చేస్తూనే ఉంటాం. మా వీక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి ఈ రోజు ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదని, కానీ ఈ రోజు తప్పకుండా వస్తుందని నేను నమ్మాను. కష్టానికి, అంకితభావానికి, ధైర్యానికి ప్రత్యామ్నాయం లేదని నేను నమ్ముతున్నాను. అదే సమయంలో, కుట్రలు ఎక్కువ కాలం పనిచేయవని నేను కూడా నమ్ముతున్నాను’ అంటూ పేర్కొన్నారు.

సీఈవో బరుణ్ దాస్ మాట్లాడుతూ కష్టానికి విరామం ఉండదని, టీఆర్పీ రేటింగ్ విషయంలో కూడా మా మధ్య వార్ నడుస్తోంది. టీఆర్‌పీ రేటింగ్స్‌లో నంబర్‌వన్‌ వైపు వెళ్తున్నప్పుడు కొంతమందికి నచ్చలేదు. రేటింగ్‌ను నిలిపివేశారు. ఇది సరికాదని నా అభిప్రాయం. రేటింగ్‌ను ప్రారంభించడానికి మేం చాలా కష్టపడ్డాం. దీని కారణంగా, ప్రకటనదారులు కూడా చాలా సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. అలాగే గ్రూప్ ఎడిటర్ బి.వి.రావు మాట్లాడుతూ.. ‘ఈ రోజు మీడియాలో నంబర్ వన్ ఎవరో తెలిసిపోయింది. ఇందుకోసం టీఆర్‌పీలను అడ్డుకోవడం సరికాదు. పరిశ్రమకు ఇదొక నిదర్శనమని’ పేర్కొన్నారు.

Also Read: India Coronavirus Updates: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

Holi 2022 Live: అంబరాన్ని అంటుతున్న హోలీ సంబరాలు.. ప్రత్యేక విజువల్స్ మీ కోసం.. (లైవ్ వీడియో)