Delhi: సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ఈడీ. వరుసగా ఏడోసారి సమన్లు పంపింది. ఈసారి కూడా దర్యాప్తునకు హాజరుకాకపోతే కేజ్రీ అరెస్ట్ తప్పదని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు పంపారు. ఈ నెల 26న హాజరు కావాలని సూచించింది. అయితే ఈడీ విచారణకు కేజ్రీ హాజరుకావడం లేదు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈడీ ఇప్పటికే ఆరు సార్లు సమన్లు పంపించింది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ఈడీ. వరుసగా ఏడోసారి సమన్లు పంపింది. ఈసారి కూడా దర్యాప్తునకు హాజరుకాకపోతే కేజ్రీ అరెస్ట్ తప్పదని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు పంపారు. ఈ నెల 26న హాజరు కావాలని సూచించింది. అయితే ఈడీ విచారణకు కేజ్రీ హాజరుకావడం లేదు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈడీ ఇప్పటికే ఆరు సార్లు సమన్లు పంపించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున సమన్లు పంపడం చట్ట విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ వాదిస్తోంది. కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోర్టు నిర్ణయం వచ్చే వరకూ ఈడీ వేచిచూడాల్సిందే అని వాదిస్తోంది. ఈడీ పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపిస్తూ కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదు.
గత ఏడాది నవంబర్ 2, నవంబర్ 21, జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 19న హాజరుకావాలంటూ ఈడీ ఇప్పటికే ఆరుసార్లు సమన్లు పంపింది. ఈడీ పంపిన సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఇదే కేసులో రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియాను పోలీసులు హాజరు పరిచారు. మనీష్ సిసోడియాకు జ్యూడిషియల్ కస్టడీని మార్చి 12 వ తేదీ వరకూ రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. తదుపరి దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవరులో కోర్టుకు సీబీఐ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే స్టేటస్ రిపోర్ట్‌ను బయటపెట్టవద్దని కోర్టును కోరింది. విచారణ వివరాలను వెల్లడించలేమని సీబీఐ తెలిపింది. ఇదిలా ఉంటే గత శనివారం ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలతో పాటు అవిశ్వాస తీర్మానం ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు కేజ్రీవాల్ న్యాయవాధి రమేష్ గుప్తా. అలాగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారని కోర్టుకు తెలిపారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కాస్త ఉపశమనం కల్పించారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన కేజ్రీవాల్ తన ప్రస్తుత పరిస్థితి గురించి వివరించిన తరువాత.. కోర్టు తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




