చెల్లెలి ప్రియుడిని కిడ్నాప్ చేసి.. దారుణంగా హత్య చేసి.. ముక్కలుగా చేసి కుక్కలకు పడేశాడు..

సమాజంలో మానవ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయి. అతిగా పెంచుకుంటున్న ప్రేమ.. తీవ్ర పరిణామాలకు కారణమవుతున్నాయి. తెలిసో తెలియక చేసిన తప్పులకు సొంతవాళ్లు అనే తేడా లేకుండా...

చెల్లెలి ప్రియుడిని కిడ్నాప్ చేసి.. దారుణంగా హత్య చేసి.. ముక్కలుగా చేసి కుక్కలకు పడేశాడు..
Crime News
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 27, 2022 | 9:31 AM

సమాజంలో మానవ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయి. అతిగా పెంచుకుంటున్న ప్రేమ.. తీవ్ర పరిణామాలకు కారణమవుతున్నాయి. తెలిసో తెలియక చేసిన తప్పులకు సొంతవాళ్లు అనే తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. అతి క్రూరంగా ప్రవరిస్తూ.. దారుణంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా బిహార్ లో ఇలాంటి ఘటనే జరిగింది. చెల్లి ఓ యువకుడిని ప్రేమిస్తోందన్న కారణంతో.. అన్న చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. చెల్లెలి ప్రియుడిని కిడ్నాప్ చేసిన అతను.. దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసి.. కుక్కలకు ఆహారంగా పడేశాడు. ముందు సాధారణ కేసుగానే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ విషయాలు తెలిసి అవాక్కయ్యారు. బిహార్ లోని నలంద జిల్లాకు చెందిన బిట్టు కుమార్‌.. ఈ నెల 16 న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కలా వెదికారు. తెలిసిన వాళ్ల ఇంట్లో ఆరా తీశారు. బంధువులకు ఫోన్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

రాహుల్‌ అనే వ్యక్తిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమదైన స్టైల్ లో విచారించగా.. రాహుల్‌ నేరాన్ని అంగీకరించాడు. తన సోదరితో బిట్టు సన్నిహితంగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయానని పోలీసులకు తెలిపాడు. దీంతో డిసెంబరు 16 న అతడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్ చేసినట్లు వివరించాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా పెట్టానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!