AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: వామ్మో.. డ్యాన్స్ తో దుమ్మురేపావుగా.. వీడియో చూస్తే నవ్వీ నవ్వీ పడిపోవాల్సిందే..

డ్యాన్స్ అనేది ఓ ఆర్ట్. మ్యూజిక్ కు అనుగుణంగా లయబద్ధంగా వేసే మూమెంట్స్ ను చూసేందుకు రెండు కళ్లు చాలవు. డ్యాన్స్ అనేది మంచి ఎక్సర్ సైజ్ కూడా. డ్యాన్స్ చేసే సమయంలో శరీరం మొత్తం ఓ రకమైన...

Trending Video: వామ్మో.. డ్యాన్స్ తో దుమ్మురేపావుగా.. వీడియో చూస్తే నవ్వీ నవ్వీ పడిపోవాల్సిందే..
Young Man Dance
Ganesh Mudavath
|

Updated on: Dec 27, 2022 | 9:14 AM

Share

డ్యాన్స్ అనేది ఓ ఆర్ట్. మ్యూజిక్ కు అనుగుణంగా లయబద్ధంగా వేసే మూమెంట్స్ ను చూసేందుకు రెండు కళ్లు చాలవు. డ్యాన్స్ అనేది మంచి ఎక్సర్ సైజ్ కూడా. డ్యాన్స్ చేసే సమయంలో శరీరం మొత్తం ఓ రకమైన వైబ్రేషన్స్ కు గురవుతుంది. కాబట్టి డ్యాన్స్ వేయడం సరిగ్గా రాని వారు కూడా స్టెప్పులు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే.. చాలా మందిలో ఇలాంటి ట్యాలెంట్ ఉంటుంది. కానీ దానిని బయటపెట్టడానికి వారికి సరైన మార్గం దొరకదు. అలాంటి వారందరికీ అద్భుత వరంగా నిలుస్తోంది సోషల్ మీడియా. ఇంటర్నెట్ వినియోగం అధికమైనప్పటి నుంచి డ్యాన్స్ కు సంబంధించిన వీడియో కుప్పలకొద్దీ సోషల్ మీడియాలో అప్ లోడ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని మళ్లీ మళ్లీ చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ కొన్ని డ్యాన్స్ వీడియోలు మాత్రం చాలా ఫన్నీగా అనిపిస్తాయి. వారు చేసే డ్యాన్స్ తో మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు సూపర్‌హిట్ పాట ‘తారే గిన్ గిన్ యాద్…’ పాటకు అద్భుతమైన స్టెప్స్ వేశాడు. ఉల్లాసభరితమైన ట్రాక్‌ వింటున్న ఆ యువకుడు వెంటనే డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. కాసేపటికే డ్యాన్స్ తీవ్రంగా మారింది. పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. అతడి డ్యాన్స్ చూసి అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. అతను అలా చేస్తాడని ఊహించలేని వారు.. నవ్వు ఆపుకోలేకపోయారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. నవ్వుతున్న ఎమోజీతో ‘కూల్ డ్యాన్స్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో కు ఇప్పటివరకు 1.1 లక్షల మందికి పైగా లైక్స్ వస్తాయి. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..