Trending Video: రైలు ప్రయాణం చేయడం ఇష్టమా.. అయితే ఒక్కసారి ఈ రైలెక్కండి.. మామూలుగా ఉండదు మరి..
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడానికి రైలు మార్గం చాలా సౌకర్యవంతమైన ఛాయిస్. పేద, ధనిక అనే భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే.. రైళ్లల్లో ప్రయాణం చేసేందుకు చాలా మంది...
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడానికి రైలు మార్గం చాలా సౌకర్యవంతమైన ఛాయిస్. పేద, ధనిక అనే భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే.. రైళ్లల్లో ప్రయాణం చేసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రైలులో వెళ్తున్నప్పుడు పట్టాలకిరువైపులా ఉండే చెట్లు, ఇళ్లు వెనక్కు పరిగెడుతున్నట్లు కనిపిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కొండలు, కోనలు, వాగులు, నదులు, ప్రకృతి అందాల గుండా రైలు సాగిపోతుంటుంది. దేశంలోని నలుమూలల రైల్వే లైన్లు ఏర్పాటయ్యాయి. కొండ ప్రాంతాల్లో కూడా. కొన్ని చోట్ల , రైల్వే మార్గాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. వాటిని చూస్తేనే మనం భయంతో వణికిపోతుంటాం. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పాంబన్ వంతెన గురించి. సముద్రం పై కట్టిన వంతెన మీదుగా రైలు కూ..చుక్..చుక్.. అంటూ పరుగులు తీస్తుంటే ఆ దృశ్యాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఓ రైలు చాలా ప్రమాదకరమైన మార్గం గుండా వెళుతోంది. చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదం తప్పదని వీడియో చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే కింద చాలా లోతైన లోయ ఉంది. అంతెత్తున ఉన్న బ్రిడ్జిపై రైలు వెళ్తుంటే.. ప్రయాణీకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చూడడానికి చాలా థ్రిల్ గా అనిపించినప్పటికీ.. చాలా ప్రమాదకరమైనది. వైరల్ అవుతున్న వీడియోను అదే రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి చిత్రీకరించాడు. ఈ రైలు మార్గం ఎంత ప్రమాదకరమైనదో వివరించాడు. అయితే, ఈ రైల్వే మార్గం ఎక్కడిదనే విషయంపై క్లారిటీ లేదు.
Terrifying view of a steep cliff while on a moving train ? pic.twitter.com/6Kq4ouyBJm
— OddIy Terrifying (@OTerrifying) December 25, 2022
వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘కదులుతున్న రైలులో భయంకరమైన దృశ్యం’ అనే శీర్షికతో ఉంది. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 43 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన తర్వాత.. నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ‘ఇది ఇంజినీరింగ్‌లో అద్భుతం’ అని కొందరు, ‘రైలు పట్టాలు తప్పితే ఏంటి’ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..