Mumbai: ఇలా కూడా చంపొచ్చా.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తకు స్లో పాయిజన్..

ప్రస్తుతం సమాజంలో నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అంతే కాకుండా నేరాలు చేయడంలో కొత్త కొత్త ప్రయత్నాలు కలవరం కలిగిస్తున్నాయి. తాజాగా తన భర్త ఫ్రెండ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ....

Mumbai: ఇలా కూడా చంపొచ్చా.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తకు స్లో పాయిజన్..
Crime
Follow us

|

Updated on: Dec 04, 2022 | 11:10 AM

ప్రస్తుతం సమాజంలో నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అంతే కాకుండా నేరాలు చేయడంలో కొత్త కొత్త ప్రయత్నాలు కలవరం కలిగిస్తున్నాయి. తాజాగా తన భర్త ఫ్రెండ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తను చంపేందుకు చేసిన ప్రయత్నం తెలిసి పోలీసుల నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త ను తొలగించేందుకు అతనికి స్లో పాయిజన్ ఇచ్చింది. అతను తినే ఆహారంలో రోజూ కొంచెం కొంచెం కలుపుతూ చివరకు చంపేసింది. మొదట సాధారణ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. అసలు విషయాలు తెలిసి విస్తుపోయారు. ముంబయి మహానగరంలోని శాంతాక్రూజ్ లో కవిత, కమల్‌కాంత్‌ షా దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఓ కూతురు, ఓ కుమార్తె ఉన్నారు. కమల్‌కాంత్‌ స్నేహితుడు హితేశ్‌ తరచూ వారి ఇంటికి వస్తుండేవారు. దీంతో హితేశ్ కు కవితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు గుట్టుగా సాగిన వీరి వ్యవహారం, ఓ రోజు బయటపడింది. విషయం తెలుసుకున్న కమల్ కాంత్ ఇది మంచి పద్ధతి కాదని వార్నింగ్ ఇచ్చాడు. అవన్నీ మానేసి బుద్ధిగా ఉండాలని సూచించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.

హితేశ్, కవిత తరచూ కలుస్తుండేవారు. దీంతో కమల్ కాంత్ భార్యతో గొడవ పడ్డాడు. రాను రాను ఇవి తీవ్రంగా మారి రోజూ జరిగే దిన చర్యగా తయారయ్యాయి. తరచూ గొడవలతో కవిత.. భర్త నుంచి వెళ్లిపోయి వేరుగా ఉంటోంది. కొన్ని రోజుల క్రితం కవిత తిరిగి భర్త దగ్గరకు వచ్చింది. పిల్లల కోసం కలిసి ఉందామని కమల్ కాంత్ ను నమ్మించింది. భార్య మాటలు నమ్మి్న కమల్ కాంత్ అందుకు ఒప్పుకున్నాడు. ఈ ఏడాది జూన్‌లో కమల్‌కాంత్‌ తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తనకు హితేశ్ మధ్య ఉన్న వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త కమల్‌ ను అంతమొందిస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని ప్లాన్ వేసింది. అప్పటి నుంచి కమల్ కాంత్ తినే ఆహారంలో ఆర్సెనిక్‌ కలపడం స్టార్ట్ చేశారు. అదికాస్తా స్లో పాయిజన్‌గా మారడంతో కొతకాలానికి అతని ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న కమల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందూతూ నవంబర్‌ 19న మృతి చెందాడు.

ఈ ఘటనను పోలీసులు సహజ మరణంగా కేసు నమోదు చేశారు. వైద్యుల నివేదిక పరిశీలించిన తర్వాత వారికి అనుమానం కలిగింది. కమల్ శరీరంలో ఆర్సెనిక్‌ వంటి విష పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కేసు మరో మలుపు తీతసుకుంది. డాక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా కవితను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్ లో విచారణ చేపట్టగా అసలు విషయాలు విని పోలీసులు అవాక్కయ్యారు. దీంతో ఆమెను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..