Mumbai Cops: పేగు బంధాన్ని మరచిన తల్లిదండ్రులు.. పునర్జన్మ ప్రసాదించిన వీధి పిల్లులు..

Mumbai Cops: అప్పుడే పుట్టిన శిశివుని మానవత్వం మరచి గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపక్కన ఉన్న మురికి కాల్వలో పడేసి వెళ్లిపోయారు. అయితే ఆ చిన్నారిని చూసిన కొన్ని..

Mumbai Cops: పేగు బంధాన్ని మరచిన తల్లిదండ్రులు.. పునర్జన్మ ప్రసాదించిన వీధి పిల్లులు..
Mumbai Cops
Follow us

|

Updated on: Nov 22, 2021 | 4:05 PM

Mumbai Cops: అప్పుడే పుట్టిన శిశివుని మానవత్వం మరచి గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపక్కన ఉన్న మురికి కాల్వలో పడేసి వెళ్లిపోయారు. అయితే ఆ చిన్నారిని చూసిన కొన్ని వీధి పిల్లులు అప్రమత్తమయ్యి.. స్థానికులను అప్రమత్తం చేశాయి. వెంటనే నివాసితులు స్పందించి.. ఆ నవజాత శిశువుని గుర్తించారు. వెంటనే చిన్నారిని కాలువ నుంచి రక్షించారు. సమీపంలోని పోలీసు స్టేషన్ కు సమాచారం అందించారు. ఈ దారుణ ఘటన దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల వివరాల కోసం ముంబై పోలీసులు చిన్నారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

పంత్‌నగర్ ప్రాంతంలోని వీధిలోని కొన్ని పిల్లులు అల్లకల్లోలం సృష్టించడం ప్రారంభించాయి. దీంతో సమీపంలో నివసించేవారు పిల్లలును తరమడానికి రాగా.. అక్కడ రోడ్డు పక్కన కాల్వలో ఓ శిశువు బట్టల్లో చుట్టి ఉండడం చూశారు.  వెంటనే పాపని రక్షించిన స్థానికులు పంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌ తో పాటు.. పెట్రోలింగ్ చేస్తున్న నిర్భయ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

చిన్నారిని పంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన నిర్భయ స్క్వాడ్..  రాజవాడి (హాస్పిటల్)కి తరలించింది. చిన్నారి 9ఇప్పుడు ఆరోగ్యంగా ఉందని.. పోలీసులు చెప్పారు. అంతేకాదు చిన్నారితో ఉన్న ఫోటోలను అధికారులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. చిన్నారిని పడేసిన తల్లిదండ్రుల కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఇంకా వారి గురించి ఎటువంటి సమాచారం తెలియలేదని ట్విట్ చేశారు.

Also Read: ప్రజల నిర్లక్ష్యం.. రష్యాలో ఆగని కరోనా కల్లోలం.. మళ్ళీ భారీగా కేసులు నమోదు..