YouTube Video: యూట్యూబ్ చూసి బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక! తరువాత ఏం జరిగిందంటే..
యూట్యూబ్ గందరగోళం చాలా ఎక్కువగా ఉంది. తాజాగా కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ వీడియో చూసి 17 ఏళ్ల అమ్మాయి ఇంట్లోనే ప్రసవించింది.
YouTube Video: యూట్యూబ్ గందరగోళం చాలా ఎక్కువగా ఉంది. తాజాగా కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ వీడియో చూసి 17 ఏళ్ల అమ్మాయి ఇంట్లోనే ప్రసవించింది.ఈ సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ అమ్మాయి అక్టోబర్ 20 న బిడ్డకు జన్మనిచ్చింది. మీడియా కథనాల ప్రకారం, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, బాలిక తన బిడ్డతో పాటు గదిలో తాళం వేసుకుని ఉండిపోయింది. మూడు రోజులుగా తన కూతురు గర్భవతి అని, ప్రసవం అయిందని, అదే ఇంట్లో అప్పుడే పుట్టిన పాప ఉందని ఆమెకు తెలియదు. అయితే, ఇంట్లోని వ్యక్తులు వేరే ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం చేసి..బాలికను గర్భవతిని చేసిన 21 ఏళ్ల యువకుడిని పోక్సో చట్టం.. ఐపిసి సెక్షన్ 376 (రేప్) సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని పోలీసులు అంటున్నారు.
ఇన్ఫెక్షన్ సోకడంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది..
ప్రసవం తర్వాత మూడు రోజుల పాటు ఇంటి లోపల ఉన్న బాలికకు ఇన్ఫెక్షన్ సోకింది. ఈ క్రమంలో తన కూతురు ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తల్లికి తెలిసింది. ఆ తర్వాత ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇద్దరికీ చికిత్స అందించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని.. తనకు డెలివరీ సమయంలో ఎలా చేయాలో తెలీలేదనీ.. యూట్యూబ్ చూసి తెలుసుకున్నాననీ బాలిక చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గర్భిణి అయిన ఆమెకు ఈ ఐడియా ఇచ్చింది ఆమెను గర్భవతిని చేసిన వ్యక్తి కావడం. పైగా ఈ విషయాన్ని ఆ అమ్మాయి స్వయంగా వెల్లడించడం చాలా షాకింగ్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడి కుటుంబీకులు బాలికను, ఆమె బిడ్డను చూసుకుంటున్నారు.
అమ్మాయి ఆన్‌లైన్ క్లాస్ లో ఉందని తల్లి భావించింది..
ప్రసవించిన తర్వాత బొడ్డు తాడును ఎలా కత్తిరించాలో తెలుసుకోవాలంటే యూట్యూబ్ వీడియో చూడాలని నిందితుడు ఆమెకు సలహా ఇచ్చాడు. బాలిక గర్భం దాల్చిన విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడంపై సీడబ్ల్యూసీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే, ఈ బాలిక తల్లి అంధురాలు. ఆమె భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని, నిత్యం నైట్ డ్యూటీలో ఉంటాడని ఆమె తెలిపింది. బాలిక ఆన్‌లైన్ తరగతులు చేస్తుందని భావించిన తల్లి ఆమెను గదిలో బంధించింది. ఆమె చాడువుకుంతోది అని తల్లి భావించింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి: PM Modi: భారత్-ఆసియాన్ 18వ సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ.. ఆసియా దేశాలతో సామరస్యమే ఎజెండా!
Air India: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై విమానం ఎక్కాలంటే.. ఎయిర్ ఇండియాలోనే ప్రయాణించాలి!