Money Lost: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై లక్ష రూపాయలు మర్చిపోయిన వ్యక్తి.. కానీ ఊహించని రీతిలో..

Money Lost: ప్రస్తుత కాలంలో ప్రజల్లో మానవత్వం, దయ, జాలి అనేవే లేకుండా పోతున్నాయని అందరూ అంటుంటారు. కానీ, మనుషుల్లో..

Money Lost: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై లక్ష రూపాయలు మర్చిపోయిన వ్యక్తి.. కానీ ఊహించని రీతిలో..
Railway Platform
Follow us

|

Updated on: Jul 05, 2021 | 8:00 AM

Money Lost: ప్రస్తుత కాలంలో ప్రజల్లో మానవత్వం, దయ, జాలి అనేవే లేకుండా పోతున్నాయని అందరూ అంటుంటారు. కానీ, మనుషుల్లో ఆ లక్షణాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని కొందరు నిత్యం నిరూపిస్తూనే ఉంటారు. అలాంటి ఉదాహరణ ఘటనే దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగు చూసింది. నరేందర్ కుమార్ అనే ఓ పోలీసు అధికారి తనలోని నిజాయితీని, మానవత్వాన్ని చాటుకున్నాడు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై మర్చిపోయిన లక్ష రూపాయల సొమ్మును తిరిగి బాధిత వ్యక్తికి అందేలా కృషి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. విజయ్ కుమార్(53) అనే వ్యక్తి ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. తన వెంట ఒక బ్యాగ్ కూడా తెచ్చారు. ఆ బ్యాగ్‌లో లక్ష రూపాయల డబ్బు ఉంది. అయితే, విజయ్ కుమారు పొరపాటున ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లడం మర్చిపోయాడు. కొంత దూరం వెళ్లాక తన బ్యాగ్ గుర్తుకువచ్చింది.

అయితే అప్పటికే సమయం దాటిపోవడంతో.. డబ్బును పోయి ఉంటుందని భావించి ఆశలు వదులుకున్నాడు. కానీ, ఇప్పుడే అసలు ట్విస్ట్ వచ్చింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో నరేందర్ కుమార్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో అతనికి బ్యాగ్ కనిపించగా.. చెక్ చేశాడు. అందులో లక్ష రూపాయల నగదుతో పాటు విజయ్ ఆధార్ కార్డు, ఇతర వస్తువులు కనిపించాయి. దాంతో ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్న నరేందర్ కుమార్.. ఆధార్ కార్డు డీటెయిల్స్ ద్వారా విజయ్‌ను సంప్రదించాడు. అతనికి విషయం చెప్పి పోలీసు స్టేషన్‌కు రావాల్సిందిగా సమాచారం అందించాడు. వెంటనే స్టేషన్‌కు వచ్చిన విజయ్‌కు కానిస్టేబుల్ నరేందర్ కుమార్ డబ్బు ఉన్న బ్యాగ్‌ను తిరిగి అప్పగించాడు. పోయిందనుకున్న డబ్బు తిరిగి దొరకడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. నరేందర్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ఈ డబ్బు తిరిగి వస్తుందనుకోలేదు. ఆశలన్నీ వదులకున్నాను. కానీ, ఆ దేవుడు నరేందర్ కుమార్ రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నారు’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు విజయ్ కుమార్.

Also read:

Drunk and Drive: మళ్లీ యాక్షన్ సీన్‌లోకి సైబరాబాద్ పోలీసులు.. రావడం రావడంతోనే డ్రంకన్ డ్రైవర్లకు ఊహించని ఝలక్..

Brahmamgari Matam: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వివాదంలో మరో ట్విస్టు.. ఇవాళ మహాలక్ష్మమ్మ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ