Government Employee: నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించాడు ప్రభుత్వ ఉద్యోగి.. చివరకు ఏమైందంటే..!
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న ఆరోపణలతో కోర్టుకు వెళ్లిన మహిళకు నిరాశ ఎదురైంది. ఒక మహిళను వివాహం చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకున్నాడు ప్రభుత్వ ఉద్యోగి. కొంత కాలం ఆమెతో కలిసి మాట్లాడటం, కలిసి తిరగడం లాంటివి చేశారు. ఆ తరువాత వరకట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే పెళ్లి చేసుకోనన్నాడు. కట్నం ఇవ్వడానికి అంగీకరించలేదు అమ్మాయి కుటుంబీకులు. దీంతో తాను పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగాడు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఢిల్లీ

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న ఆరోపణలతో కోర్టుకు వెళ్లిన మహిళకు నిరాశ ఎదురైంది. ఒక మహిళను వివాహం చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకున్నాడు ప్రభుత్వ ఉద్యోగి. కొంత కాలం ఆమెతో కలిసి మాట్లాడటం, కలిసి తిరగడం లాంటివి చేశారు. ఆ తరువాత వరకట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే పెళ్లి చేసుకోనన్నాడు. కట్నం ఇవ్వడానికి అంగీకరించలేదు అమ్మాయి కుటుంబీకులు. దీంతో తాను పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగాడు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అమ్మాయి కుటుంబ సభ్యులు. వీరికి కోర్టు ఏ రకమైన తీర్పు ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.
ఢిల్లీలో ప్రభుత్వం ఉద్యోగం చేసుకునే వ్యక్తితో ఒక మహిళకు ఇచ్చి వివాహం జరిపించేందుకు ఇరువురి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో నిశ్చితార్థం కూడా చేశారు. దీంతో వారి ఇద్దరి మధ్య బంధం బలపడి సాన్నిహిత్యానికి దారి తీసింది. దీంతో కొంత కాలం ఆమెతో కలిసి తిరిగిన ఇతగాడు. ఒక రోజు వరకట్నం కావాలని డిమాండ్ చేశాడు. కట్నం ఇచ్చేందుకు అంగీకరించలేదు వధువు తల్లిదండ్రులు. వివాహాం చేసుకోనని ఆమెను తిరస్కరించాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. తమ బిడ్డను పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్థం తరువాత మాట మార్చాడు. అమ్మాయిని అత్యాచారం చేశారని వధువు తరఫు న్యాయవాదులు వాదించారు.
ఇక అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు తన వాదనలను వినిపించారు. నిశ్చితార్థానికి ముందు అమ్మాయికి ఉన్న అనారోగ్య సమస్యలను గురించి కుటుంబ సభ్యులు ప్రస్తావించలేదని తెలిపారు. ఆమెతో నిశ్చితార్థం తరువాత కొన్నాళ్లు మాటామాట కలువడంతో అసలు విషయం బయటపడిందని కోర్టుముందు విన్నావించాడు. అందుకే ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళను వివాహం చేసుకోవడం ద్వారా తన దాంపత్య జీవితానికి ఇబ్బందిగా మారుతుందని వివరించాడు. ఇలా నేను పెళ్లికి నిరాకరించడంతో తనపై అత్యాచారం నింద మోపి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని జడ్జికి తన పరిస్థితిని చెప్పుకున్నారు.
ఇలా ఇరువురి వాదనలు విన్న జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. నిందితుడికి ఆ మహిళను పెళ్లిచేసుకునే ఉద్దేశ్యం లేదని, ముందు నుంచి పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్ధానం చేశాడని ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్లు తెలిపారు. ఈ ఆరోపణలకు సరైన సాక్ష్యాలు చూపడం లేని కారణంగా ఐపీసీ సెక్షన్ 376 అత్యాచారం కింద నేరం మోపడం సరైనది కాదని తీర్పును వెలువరించారు. నాలుగు నెలలుగా కలిసి తిరుగుతున్నా.. ఆ మహిళ ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించలేదని న్యాయమూర్తి తెలిపారు. నిందితుడు ఆ మహిళతో శారీరక సంబంధాన్ని ఆమె ప్రమేయంతో పెట్టుకున్నాడా.. లేక అనుమతి లేకుండా పెట్టుకున్నాడా అనే దానికి సరైన ఆధారాలు లేవన్నారు. ఇలా నిరాధారమైన కేసులో పిటిషనర్‌ను జైలులో పెడితే అతని కెరియర్ నాశనం అవుతుందని సంచలన తీర్పు ఇచ్చారు.