Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price: మళ్లీ కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర.. కిలో 70 రూపాయలు

జులై నుంచి సెప్టెంబరు వరకు టమాటా ధర నిరంతరంగా రూ.200లకు పైగా పెరగడం చూశాం. ఇప్పుడు ఉల్లి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. గత రెండు వారాల్లో ఉల్లి ధర శాతం. 50 శాతం పెరిగింది. భారతదేశ వ్యాప్తంగా టమాటా లాగా వండడానికి ఉపయోగించే ఉల్లి ధర పెరిగితే సామాన్యులకు కష్టాలు తప్పడం సహజమే. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలోని రిటైల్ స్టోర్లలో ఉల్లి ధర కిలో రూ.70 వరకు విక్రయిస్తోంది..

Onion Price: మళ్లీ కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర.. కిలో 70 రూపాయలు
Onion
Follow us
Subhash Goud

|

Updated on: Oct 27, 2023 | 4:01 PM

ఇప్పటికే ధరల పెరుగుదలతో సామాన్య జనాలు సతమతమవుతుంటే ఇప్పుడు మళ్లీ ఉల్లి ధర పెరగడం సామన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. నిత్యావసరాల నుంచి కూరగాయలు, మార్కెట్లో వివిధ రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో జనాలు అల్లాడిపోతున్నారు. సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువైపోతోంది. వంటింటి ఖర్చు భారం మరింతగా పెరిగిపోతోంది. తాజాగా ఉల్లి ధర పరుగులు పెడుతోంది. గతంలో భారీగా పెరిగిన ఉల్లి ధర.. కేంద్రం రంగంలోకి దిగి చర్యలు చేపట్టడంతో దిగి వచ్చింది. ఇప్పుడు మళ్లీ పెరుగుదల మొదలైంది.

జులై నుంచి సెప్టెంబరు వరకు టమాటా ధర నిరంతరంగా రూ.200లకు పైగా పెరగడం చూశాం. ఇప్పుడు ఉల్లి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. గత రెండు వారాల్లో ఉల్లి ధర శాతం. 50 శాతం పెరిగింది. భారతదేశ వ్యాప్తంగా టమాటా లాగా వండడానికి ఉపయోగించే ఉల్లి ధర పెరిగితే సామాన్యులకు కష్టాలు తప్పడం సహజమే. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలోని రిటైల్ స్టోర్లలో ఉల్లి ధర కిలో రూ.70 వరకు విక్రయిస్తోంది.

న్యూస్9 కథనం ప్రకారం.. నాణ్యత లేని ఉల్లి కిలో రూ.50 పలుకుతోంది. నాణ్యమైన ఉల్లి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. అయితే టమోటాల మాదిరిగా ఉల్లి ధరలు పెరిగే ఛాన్స్‌ లేదంటున్నారు వ్యాపారులు. ఎందుకంటే డిసెంబర్‌లో కొత్త ఉల్లి వస్తుందని, ధర తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఆగస్టు నెలలో ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు విధించింది. 40% సుంకం విధించారు. దేశీయంగా ఉల్లి నిల్వలు ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అయితే ఇప్పటికి కొత్త ఉల్లిపాయలు వచ్చి ఉండాల్సింది. ఉల్లి రాక ఆలస్యం కావడంతో ధరలు పెరిగాయి. డిసెంబర్‌లో కొత్త ఉల్లి రాక ధర తగ్గే అవకాశం ఉంది.

భారతదేశం ఒక సంవత్సరంలో 30 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా ఉల్లిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఒక్క మహారాష్ట్రకే 30 శాతం వరకు ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, గుజరాత్ ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో 60 శాతంకుపైగాఉల్లిని పండిస్తున్నారు.

గోధుమలు, బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయి:

ఇప్పుడు ఉల్లి మాత్రమే కాదు గోధుమలు, బియ్యం తదితర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వం బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతిపై ఆంక్షలు విధించింది. గత ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయికి గోధుమల ధరలు పెరిగాయి. ప్రభుత్వం తన వద్ద ఉన్న గోధుమలను బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తోంది. వారానికి ఒకసారి గోధుమల వేలం నిర్వహిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి