AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamili Elections: దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ?

దేశంలో ప్రస్తుతం వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంశం చర్చనీయాంశమవుతుంది. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే దీనిపై సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ అనే సంస్థ ఓ ఆసక్తికరమైన సంగతిని వెల్లడించింది. దేశంలో గ్రామ పంచయతీల నుంచి పార్లమెంటు స్థాయి వరకు ఒకేసారి జమిలీ ఎన్నికలు గనుక జరపితే.. ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపింది.

Jamili Elections: దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ?
Vote
Aravind B
|

Updated on: Sep 13, 2023 | 9:26 AM

Share

దేశంలో ప్రస్తుతం వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంశం చర్చనీయాంశమవుతుంది. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే దీనిపై సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ అనే సంస్థ ఓ ఆసక్తికరమైన సంగతిని వెల్లడించింది. దేశంలో గ్రామ పంచయతీల నుంచి పార్లమెంటు స్థాయి వరకు ఒకేసారి జమిలీ ఎన్నికలు గనుక జరపితే.. ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపింది. ఒకవేళ ఈ ఎన్నికల ప్రక్రియను కేవలం వారం రోజుల్లోనే పూర్తి చేసినట్లైతే.. రాజకీయ పార్టీలు నియమావళిని కచ్చితంగా పాటించినట్లైతే ఈ ఖర్చును 3 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపింది. అలాగే వచ్చే సంవత్సరం జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం లక్ష 20 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసింది.

ఇందులో ఎన్నికల సంఘం ఖర్చు చేసేది 20 శాతం మాత్రమే ఉంటుందని చెప్పింది. అయితే కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఖర్చు కూడా ఇందులో భాగం కాదని వివరణ ఇచ్చింది. అయితే ఈ అధ్యయన వివరాలను సంస్థ విశ్లేషకుడు ఎన్ భాస్కర్ రావు మీడియాకు వివరించారు. లోక్‌సభతో సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికలను జరిపితే.. 10 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. అయితే ఇది కేవలం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చు మాత్రమే కాదని.. ఇందులో పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారం కోసం చేసేటటువంటి ఖర్చులు కూడా ఇమిడి ఉన్నాయని తెలిపారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటింకముందే రాజకీయ పార్టీలు తమ ప్రచారాలని ప్రారంభించడం మొదలుపెడతాయని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలకు.. 1.20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. అలాగే దేశంలో అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించినట్లేతే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు. ఇక జిల్లా పరిషత్‌, మండలాలు, గ్రామ పంచాయతీలకు కలిపితే ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. దాదాపు 4.30 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలక్షన్ల కోసం 6,400 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారు. కానీ 2,600 కోట్లు మాత్రమే ఖర్చు అయినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..