AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అవుతాయా ?.. ఒకవేళ అదే జరిగితే.. ?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావొచ్చని.. పార్లమెంట్‌తో పాటు మే నెలలో జరిగినా ఆశ్చర్యం లేదని మంత్రి కేటీఆర్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. భారత ప్రజాస్వామ్యంలో ఇలా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావడం అనేది జరగలేదు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ పదవీ కాలం పూర్తయ్యేలోపుగా కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేలా ఎన్నికల సంఘం ఎలక్షన్లు నిర్వహిస్తుంది. అయితే ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు ప్రణాళికలు చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అవుతాయా ?.. ఒకవేళ అదే జరిగితే.. ?
Vote
Aravind B
|

Updated on: Sep 13, 2023 | 10:56 AM

Share

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావొచ్చని.. పార్లమెంట్‌తో పాటు మే నెలలో జరిగినా ఆశ్చర్యం లేదని మంత్రి కేటీఆర్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. భారత ప్రజాస్వామ్యంలో ఇలా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావడం అనేది జరగలేదు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ పదవీ కాలం పూర్తయ్యేలోపుగా కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేలా ఎన్నికల సంఘం ఎలక్షన్లు నిర్వహిస్తుంది. అయితే ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు ప్రణాళికలు చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణం వల్ల ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేసి డిసెంబర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఆలస్యం చేయనున్నారనే ఊహాగాణాలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే ఇలా ఆలస్యం చేస్తే తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక మినీ జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేసినట్లైతే.. ఎన్నికలు వచ్చే ఏడాది మే నెలలో నిర్వహిస్తారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ పదవీ కాలం జనవరి రెండో వారానికి ముగుస్తుంది. అయితే మరి ఎన్నికలు జరిగే మే నెల వరకు ప్రభుత్వం ఏ పాలన విధిస్తుందన్నేదే ప్రశ్న. అప్పుడు ప్రజాప్రతినిధులు ఉండరు కాబట్టి ప్రభుత్వం అనే మాటే ఉండదు. ముఖ్యమంత్రి అనే మాట వినిపించదు. అలాగే ప్రభుత్వాన్ని మరికొంతకాలం పొడిగించే ఛాన్స్ ఉండదు. రాజ్యాంగ సవరణలో ప్రభుత్వ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడగిస్తూ ఏదైనా మార్పులు చేసినట్లైతే.. అప్పుడు అవకాశాలు ఉండొచ్చు. కానీ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఏర్పాటైన ప్రభుత్వాన్ని కొత్తగా చేసే సవరణలతో పొడగిస్తే ఎలా సాధ్యమవుతుందనే సందేహాలు వస్తున్నాయి. ప్రజలు కూడా ఐదేళ్ల కాలానికి మాత్రమే ఓట్లు వేశారు. అంతేగాని అంతకు మించి పదవిలో ఉండేందుకు రాజ్యాంగం ఒప్పుకోదు.

అయితే ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్షోభ పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలనను విధించుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్రపతి పాలనను విధించిన సంఘటనలు ఎక్కడా జరగలేవు. అయితే ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. జమిలీ ఎన్నికల కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే రాష్టపతి పాలన విధించడం అనేది చాలా తేలికైన ఆప్షన్‌గా కనిపిస్తుంది. ప్రభుత్వాల అధికారాన్ని పొడగించినట్లైతే భవిష్యత్‌లో కూడా అనేక సమస్యలు వస్తాయి. అయితే రాష్ట్రపతి పాలన ద్వారా సమస్యను సులువుగా అధిగమించే అవకాశం ఉంటుంది. ఇది బీజేపీకి కూడా కలిసి వస్తుంది. ఒక వేళ జమిలీ ఎన్నికల కోసం ప్రభుత్వ పదవీ కాలాన్ని పొడగించినట్లేతే బీఆర్ఎస్ ఇష్టం లేకున్నా అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రాష్ట్రపతి పాలనను మాత్రం వ్యతికేస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..