AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai: విమానాశ్రయంలో కాస్త తేడాగా వృద్ధుడి వాలకం.. పోలీసులు తనిఖీ చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు..

పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెడుతోన్న అక్రమార్కులు మాత్రం తగ్గడం లేదు. విదేశాల నుంచి అక్రమంగా వస్తువులను దేశంలోని తరలిస్తున్నారు. ఎయిర్‌ పోర్ట్‌లో బంగారం, డ్రగ్స్‌తో పట్టుబడుతోన్న సంఘటనలు అడపాదడపా వెలుగులోకి వస్తూనే...

Chennai: విమానాశ్రయంలో కాస్త తేడాగా వృద్ధుడి వాలకం.. పోలీసులు తనిఖీ చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు..
Representative Image
Narender Vaitla
|

Updated on: Mar 10, 2023 | 9:39 PM

Share

పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెడుతోన్న అక్రమార్కులు మాత్రం తగ్గడం లేదు. విదేశాల నుంచి అక్రమంగా వస్తువులను దేశంలోకి తరలిస్తున్నారు. ఎయిర్‌ పోర్ట్‌లో బంగారం, డ్రగ్స్‌తో పట్టుబడుతోన్న సంఘటనలు అడపాదడపా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. చెన్నై ఎయిర్‌ పోర్ట్‌లో ఫ్లైట్ దిగిన 79 ఏళ్ల వృద్ధుడు వాలకం తేడాగా కనిపించడంతో అధికారులు సెర్చ్‌ చేయగా అడ్డంగా దొరికిపోయాడు. ఇంతకీ విషయం ఏంటంటే..

ముంబైకి చెందిన అనిల్‌ బాల్కిసందాస్‌ గోరాడియా అనే వ్యక్తి జింబావ్వే నుంచి ఇథియోపియా మీదుగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాడు. ముసలాయన వాలకం తేడా కొట్టడంతో అధికారులు చెక్‌ చేశారు. రూ. 57 కోట్ల విలువైన ఎనిమిది కిలోల హెరాయిన్‌ను గుర్తించారు. సదరు వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతను ఢిల్లీలోని రిసీవర్‌కు సరుకును డెలివరీ చేయడానికి వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ముందస్తు సమాచారం మేరకు అధికారులు అతన్ని సూట్ కేస్‌ చెక్‌ చేయగా హెరాయిన్‌ బటయపడింది. సూట్‌కేస్‌కు దిగువన, పైభాగంలో దాచిన హెరాయిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జింబాబ్వే విమానాశ్రయంలో గుర్తు తెలియని వ్యక్తులు సూట్‌కేస్‌ను అతనికి అందజేసినట్లు విచారణలో తేలింది. ఆయనకు చెన్నై నుంచి ఢిల్లీకి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. గోరాడియాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో