Kumbh Mela 2021: హరిద్వార్ కుంభమేళాకు 91 లక్షల మంది హాజరు.. ఈ నెలలోనే 60 లక్షల మంది..
Haridwar Kumbh Mela 2021: దేశంలో కరోనావైరస్ తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో నిర్వహించిన మహా కుంభమేళాకు
Haridwar Kumbh Mela 2021: దేశంలో కరోనావైరస్ తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో నిర్వహించిన మహా కుంభమేళాకు మొత్తం 91 లక్షల మంది భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్ 27 మధ్య ఈ 91 లక్షల మంది గంగలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు కుంభమేళ ఫోర్స్ శుక్రవారం వెల్లడించింది. ఇందులో ఏప్రిల్ నెలలోనే 60 లక్షల మంది హరిద్వార్‌కు చేరుకున్నట్లు కుంభమేళా ఫోర్స్ వెల్లడించింది. అందులో ఏప్రిల్ 12న ఒక్కరోజే 35 లక్షల మంది రాగా.. అంతకుముందు శివరాత్రి సందర్భంగా మార్చి 11న 32 లక్షల భక్తులు వచ్చినట్లు కుంభమేళా నిర్వాహకులు తెలిపారు.
కుంభమేళా సందర్భంగా 13 అఖాడాలకు చెందిన 2 వేల మంది సాధువులు గంగలో రాజ స్నానాలు చేయగా.. అందులో కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతోపాటు వందలాది మంది భక్తులకు కరోనాకు సోకింది. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వాలు సైతం కుంభమేళాకు వెళ్లొచ్చిన భక్తులు క్వారంటైన్‌లో ఉండాలని.. వివరాలు ఇవ్వాలని మార్గదర్శకాలు సైతం జారీ చేశాయి. కుంభమేళా మొత్తం ముగిసిన అనంతరం బుధవారం (ఏప్రిల్ 28) నుంచి హరిద్వార్‌లో కర్ఫ్యూ విధించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. హరిద్వార్‌తోపాటు రూర్కీ, లక్సర్, భగ్‌వాన్‌పూర్‌లలో కర్ఫ్యూ విధించారు.
ఏప్రిల్ 30న ముగియాల్సిన ఈ కుంభమేళాను కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగానే ముగించాలని ప్రధానమంత్రి మోదీ నిర్వాహకులకు సూచించారు. దీంతో ఏప్రిల్ 17న కుంభమేళా ముగిసినట్లు నిర్వహకులు ప్రకటించారు. కాగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో కుంభమేళా నిర్వహించడంపై ప్రభుత్వంపై వివర్శలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ నిర్వాహకులతో మాట్లాడటంతో.. ముందుగానే కుంభ్ ముగిసినట్లు ప్రకటించారు.
Also Read: