Corona: ఎవరిని వదలని కరోనా మహమ్మారి.. వైరస్ బారిన పడి బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మృతి
నిత్యం వేల కేసుల నుంచి లక్షల కేసులకు చేరుతోంది. కాగా, మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది.
Bihar chief secretary arun kumar singh : కరోనా వికృతరూపంతో భారత దేశం తల్లడిల్లుతోంది. నిత్యం వేల కేసుల నుంచి లక్షల కేసులకు చేరుతోంది. కాగా, మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా రాకాసి కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా కరోనా కాటుకు బలయ్యారు. ఇటీవల కరోనా బారినపడ్డ అరుణ్‌కుమార్ సింగ్ పాట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. ఈమేరకు వైద్యాధికారులు వెల్లడించారు.
Bihar chief secretary Arun Kumar Singh passes away at a hospital in Patna where he was undergoing treatment for #COVID19.
(File photo) pic.twitter.com/BXZMorbQAx
— ANI (@ANI) April 30, 2021
Read Also…