Viral News: కొవిడ్ వార్డ్‌లో స్టెప్పులేసిన వైద్య సిబ్బంది.. రోగులను ఉత్సాహపరుస్తూ పాటకు డాన్స్‌లు.. వీడియో వైరల్
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తుంది. రోగుల కోసం వైద్య సిబ్బంది అనునిత్యం శ్రమిస్తున్నారు....
కోవిడ్ వార్డులో స్టెప్పులేసిన వైద్య సిబ్బంది రోగులను ఉత్సాహపరుస్తూ పాటకు డాన్స్‌లు వీడియో వైరల్ పాటకు గొంతు కలిపిన రోగులు
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తుంది. రోగుల కోసం వైద్య సిబ్బంది అనునిత్యం శ్రమిస్తున్నారు. మరోవైపు కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో ఆస్పత్రుల, వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అయినా రోగుల్లో మనోధైర్యం నింపేందుకు వైద్యారోగ్యసిబ్బంది చిరునవ్వుతో శ్రమిస్తున్నారు. వైరస్ సోకే ముప్పు ఉన్నా సిబ్బంది ఆ భయాన్ని పక్కనపెట్టి రోగులకు చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ రోగుల్లో ఉత్సాహం నింపేందుకు హెల్త్ కేర్ సిబ్బంది ఆడిపాడారు. రోగులను సంతోషపరచటానికి వైద్య సిబ్బంది ఓ పంజాబీ పాటకు ఆడిపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పీపీఈ కిట్లు ధరించిన డాక్టర్లు, ఇతర సిబ్బంది రోగులతో కలిసి పంజాబీ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. కొందరు రోగులు చప్పట్లు కొడుతూ బెడ్ పైనే భాంగ్రా స్టెప్పులను అనుకరించారు. గుర్మీత్ చద్దా అనే యూజర్ ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు.
Amazing spirit. Salute Our doctors & healthcare warriors!
Brought a smile ..
PS- beautiful song as well ( fwd)@deepaksidhu pic.twitter.com/M53pPTyJqw
— Gurmeet Chadha (@connectgurmeet) April 28, 2021