7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పండగ సీజన్‌లో జీతం పెంపుతో పాటు డబుల్‌ బోనస్‌ రానుందా?

Employees Bonus: కేంద్ర సర్కార్‌ ఉద్యోగులకు పండగ సీజన్‌ సందర్భంగా డబుల్‌ బోనస్‌ రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆశలు రెకేత్తాయి. 7వ వేతన..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పండగ సీజన్‌లో జీతం పెంపుతో పాటు డబుల్‌ బోనస్‌ రానుందా?
Follow us
Subhash Goud

|

Updated on: Oct 01, 2021 | 5:53 AM

7th Pay Commission: కేంద్ర సర్కార్‌ ఉద్యోగులకు పండగ సీజన్‌ సందర్భంగా డబుల్‌ బోనస్‌ రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆశలు రెకేత్తాయి. 7వ వేతన సంఘం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందుతుందని పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ(డియర్‌నెస్ అలవెన్స్), డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) పెంపుతో కలిపి ఈ వారం డబుల్ బోనస్ రాబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 17శాతం నుంచి 28 శాతానికి పెంచగా, అది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత హెచ్‌ఆర్‌ఏని (హౌజ్ రెంట్ అలవెన్స్)ని కూడా పెంచింది.

ఉద్యోగుల బేసిక్‌ శాలరీ ఆధారంగా..

ఉద్యోగుల బేసిక్ శాలరీ ఆధారంగా రెంట్ అలవెన్స్‌తో పాటు డీఏలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం.. హెచ్‌ఆర్‌ఏ 3 శాతం పెరగనుండగా, డీఏ, 25 శాతం దాటనుంది. అయితే హెచ్‌ఆర్‌ఏకి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా ఈనెల జీతంతో పాటు వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

హెచ్‌ఆర్‌ఏ ఎలా పెరుగుతుందంటే..

ప్రభుత్వ ఉద్యోగులు ఉండే నగరాల ఆధారంగా హెచ్‌ఆర్‌ఏను ప్రభుత్వం అందిస్తుంది. నగర జనాభా ఆధారంగా మూడు క్యాటగిరీలుగా నగరాలను విభజించింది. ఎక్స్‌ క్యాటగిరీలో 50 లక్షల కన్నా ఎక్కువ జనాభా కలిగిన నగరాలు ఉన్నాయి. ఈ క్యాటగిరీలోని ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 27 శాతానికి పెరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే వై క్యాటగిరీ.. అంటే 5 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరంలోని ఉద్యోగులకు 18 శాతం, ఇక జడ్‌ క్యాటగిరీ.. అంటే 5 లక్షల కన్నా తక్కువ జనాభా ఉండే నగరాల్లోని ఉద్యోగులకు 9 శాతం హెచ్‌ఆర్‌ఏ అందించనున్నట్లు సమాచారం.

వేతనం ఎంత పెరుగుతుంది?

లెవల్-1లో ప్రభుత్వ ఉద్యోగి నెలవారీ వేతనం రూ .18 వేల నుంచి రూ.56,900 వరకు ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగి వేతనం కనీసం రూ .18వేలు ఉంటుంది. 17 శాతం డీఏ రేటు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు 2021 జూన్ వరకు డియర్‌నెస్ అలవెన్స్‌గా రూ. 3,060 పొందుతున్నారు. జూలై 2021 నుంచి (డీఏ పెంపు తర్వాత) ఉద్యోగులు నెలకు రూ. 5,040 పొందుతున్నారు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతం రూ. 1,980 పెరిగింది. కాగా, కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర సర్కార్‌ గత ఏడాది నుంచి ఈ ఏడాది ప్రథమార్ధం వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపును నిలుపుదల చేసింది. తాజాగా డీఏ, డీఆర్‌లను పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Digital Payments: డిజిటల్‌ చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం టాప్‌.. ఫోన్‌పే సర్వేలో వెల్లడి..!

New Car: పండగ సీజన్‌ వచ్చేస్తోంది.. కారు కొనాలనుకుంటున్నారా..? కాస్త వీటిని కూడా పట్టించుకోవాలి.. అవేంటంటే..!