New Car: పండగ సీజన్‌ వచ్చేస్తోంది.. కారు కొనాలనుకుంటున్నారా..? కాస్త వీటిని కూడా పట్టించుకోవాలి.. అవేంటంటే..!

New Car: విజయదశమి, దీపావళి పండగలు వచ్చేస్తున్నాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ పండగలకు కొనుగోలు చేస్తుంటారు. విజయదశమి..

New Car: పండగ సీజన్‌ వచ్చేస్తోంది.. కారు కొనాలనుకుంటున్నారా..? కాస్త వీటిని కూడా పట్టించుకోవాలి.. అవేంటంటే..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 30, 2021 | 8:28 AM

New Car: విజయదశమి, దీపావళి పండగలు వచ్చేస్తున్నాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ పండగలకు కొనుగోలు చేస్తుంటారు. విజయదశమి, దీపావళి నాటికల్లా కొత్త కారు ఇంటికి తీసుకురావాలనే ఆలోచన ఎంతోమందికి ఉంటుంది. అందుకే కరోనా మహమ్మారి సమయంలో ఇతర రంగాలకంటే వాహన రంగం త్వరగా కోలుకుంది. కారు కొనుగోలు చేసేందుకు ముందు నుంచే ప్రణాళికలూ సిద్ధం చేసుకుంటారు. ఇలా కారు కొనుగోలు చేయాలని ఆలోచించినప్పుడు కాస్త వీటిని కూడా పట్టించుకుంటే మంచిది. అవేంటంటే..

ఆర్థిక భారం ఉండకుండా చేసుకోవడం..

కారు కొనడం అనేది చాలా మందికి ఒక కల.కొంత సొంత డబ్బు, మిగతా రుణం తీసుకొని సులభంగానే కారు కొనవచ్చు. కానీ, ఇక్కడే ఒక విషయం గమనించాలి. ఇప్పటికే మీకు ఇతర అప్పులు ఉంటే.. కొత్తగా వచ్చే వాహన రుణంతో మీపై ఆర్థికంగా భారం ఎంత మేరకు ఉండవచ్చనేది చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీ మొత్తం ఆదాయంలో 40శాతానికి మించి ఈఎంఐలు ఉండకుండా చూసుకోవడం మంచిది. కారు నిర్వహణ ఖర్చులనూ బేరీజు వేసుకోండి.

ఏ మోడల్‌ కారో ముందుగానే నిర్ణయించుకోవాలి..

కారు బ్రాండ్‌, మోడల్‌ ఏది అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. దీనికి కొంత సమయం తీసుకున్నా ఇబ్బంది ఏమి లేదు. రుణం వస్తుందని, ఈఎంఐ రూపంలో తీసుకుంటున్నము కదా అని ఆలోచించకుండా కారు కొనడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. ముందే అన్నీ నిర్ణయించుకోవడం వల్ల.. ఎలాంటి చిక్కులూ లేకుండా మనకు నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు. చాలామంది కారును కొనేది ఒకేసారి కదా.. అనుకుంటూ.. తమ స్తోమతకు మించి ఖర్చు చేయడానికి వెనకాడరు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంటారు. అందుకే స్థోమతకు మించి కారు కొనడం మంచిది.

వడ్డీ భారం కాకుండా చూసుకోవాలి..

ప్రస్తుతం కారు రుణాలు 7.25 శాతం నుంచి 9.5శాతం వరకూ లభిస్తున్నాయి. కొన్నిసార్లు డీలర్లు రుణం ఎక్కువగా తీసుకున్నప్పటికీ… మీపై భారం తక్కువగా ఉంటుందని ఈఎంఐని తక్కువ చేసి చూపిస్తారు. ఇది మిమ్మల్ని ఆకర్షించేందుకే అని గమనించాలి. రుణ వ్యవధిని పెంచినప్పుడు తక్కువ ఈఎంఐ ఉంటుంది. ఇదే సమయంలో వడ్డీ భారంగా మారుతుందనేది గమనించాలి. కారు మోడల్‌, ఎంచుకున్న వ్యవధి ఆధారంగా వడ్డీ రేటులో తేడా ఉంటుంది. వీటిల్లో తేడాలు గమనించాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతారు.

రుణం, ఇతర ఖర్చులు:

కారు ఎక్స్‌ షోరూం ధరలో 80-90శాతం వరకూ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాన్ని ఇస్తున్నాయి. ఎక్స్‌ షోరూం ధరకు అదనంగా పన్ను, బీమా తదితరాలు ఉంటాయి. ఇవన్నింటినీ కలిపితే ఆన్‌రోడ్‌ ధర అంటాం. కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఆన్‌రోడ్‌ ధరపైనే 80-90శాతం వరకూ రుణం ఇచ్చేందుకు సిద్ధమవుతుంటాయి. మీ దగ్గర సొంత డబ్బు సరిపోయేంత లేకపోతే ఇలాంటి వెసులుబాటును వినియోగించుకోవచ్చు.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి