Without Mask: మాస్క్ ధరించకపోతే ఆరు నెలల జైలు శిక్ష… అలాంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు..
Without Mask: కరోనా వ్యాప్తి మొదలైన తొలి రోజుల్లో ప్రజలు చాలా అప్రమత్తతో, భయంతో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా మాస్క్‌లు ధరించడం, ఒకటి రెండు సార్లు శానిటైజ్ చేసుకోవడం ఇలా చాలా జాగ్రత్తలు పాటించారు. కానీ రోజులు గడుస్తోన్న కొద్దీ ప్రజల్లో అలసత్వం బాగా పెరిగింది. ఓవైపు కరోనా...
Without Mask: కరోనా వ్యాప్తి మొదలైన తొలి రోజుల్లో ప్రజలు చాలా అప్రమత్తతో, భయంతో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా మాస్క్‌లు ధరించడం, ఒకటి రెండు సార్లు శానిటైజ్ చేసుకోవడం ఇలా చాలా జాగ్రత్తలు పాటించారు. కానీ రోజులు గడుస్తోన్న కొద్దీ ప్రజల్లో అలసత్వం బాగా పెరిగింది. ఓవైపు కరోనా భయం ఇంకా పూర్తిగా తగ్గకపోయినా ప్రజల్లో నిర్లక్ష్యం బాగా పెరిగిపోతోంది. మునపటిలా మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం పూర్తిగా మానేశారు. ప్రస్తుతం పెరుగుతోన్న కేసులు దీని ఫలితమే. తాజాగా వెలువడుతోన్న గణంకాలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు, అధికారులు మళ్లీ అప్రమత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్సెంట్ దివ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీలో మాస్కు ధరించని వారికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. కేవలం హెచ్చరించడమే కాకుండా మాస్కులు ధరించక తిరుగుతోన్న వారిని గుర్తించేందుకు ఏకంగా 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఊటీలో మాస్కులు ధరించని వారి నుంచి ఇప్పటి వరకు రూ.30.68 లక్షల జరిమానా వసూలు చేవారు. జరిమానా విధిస్తున్నా ప్రజల్లో నిర్లక్ష్యం ఏ మాత్రం తగ్గకపోవడంతో ఈసారి ఏకంగా 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే తమిళనాడులోకి ఏపీ, పుదుచ్చేరి, కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా ఈపాస్ తీసుకోవాల్సిందేనని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేసుల్లో గణనీయ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 23,285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 23వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Also Read: CredR: బంపర్ ఆఫర్.. 25 వేలకే అదిరిపోయే బైక్‌లు.. స్కూటీలు.. ఎక్కడనుకుంటున్నారు..