CJI NV Ramana: భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ రమణకు ఐదో తరగతి విద్యార్థిని లేఖ.. స్పందించిన సీజేఐ

కొంద‌రు పిల్ల‌లు చిన్న‌త‌నంలోనే కొన్ని సామాజిక‌ అంశాల ప‌ట్ల ఎక్కువ అవ‌గాహ‌న సంపాదిస్తారు. వాటిపై త‌మ అభిప్రాయాల‌ను క‌లిగి ఉండ‌ట‌మే కాకుండా..

CJI NV Ramana: భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ రమణకు ఐదో తరగతి విద్యార్థిని లేఖ.. స్పందించిన సీజేఐ
Justice Nv Ramana
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 08, 2021 | 7:04 PM

కొంద‌రు పిల్ల‌లు చిన్న‌త‌నంలోనే కొన్ని సామాజిక‌ అంశాల ప‌ట్ల ఎక్కువ అవ‌గాహ‌న సంపాదిస్తారు. వాటిపై త‌మ అభిప్రాయాల‌ను క‌లిగి ఉండ‌ట‌మే కాకుండా.. వాటిని స‌మాజం దృష్టి తీసుకువ‌స్తారు. ఈ కోవకే చెందింది కేరళలోని త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న లిద్వినా జోసెఫ్​. కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణకు లేఖ రాసింది. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రమణకు శుభాకాంక్షలు తెలిపింది. ఢిల్లీ సహా దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన కోవిడ్ మరణాలు చూసి బాధపడ్డానని పేర్కొంది. కరోనా నియంత్రణకు సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడాన్ని ప్రశంసించిన జోసెఫ్​.. కొవిడ్​ బాధితులకు ఆక్సిజన్​ సరఫరా చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి.. వేలాది మంది ప్రాణాలను కాపాడినట్లు పేర్కొంది. ఢిల్లీలో కోవిడ్-19 మరణాల రేటు తగ్గడానికి కోర్టు ఇచ్చిన ఆదేశాలు దోహదపడ్డాయని అభిప్రాయ‌ప‌డింది. ఈ విషయంలో సుప్రీంకోర్టును చూస్తుంటే త‌న‌కు చాలా గర్వంగా ఉందని రాసుకొచ్చింది. ప్రజల ప్రాణాలు కాపాడిన సర్వోన్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖకు ఒక ఆర్ట్​ను జోడించి జస్టిస్​ రమణకు పంపింది జోసెఫ్​.

Cji

Cji

లిద్వినా జోసెఫ్ రాసిన అందమైన లేఖ, జడ్జిల పనితీరుపై హృదయానికి హత్తుకునేలా గీసిన డ్రాయింగ్ తాను అందుకున్నానని తెలిపారు సీజేఐ. దేశంలో జరుగుతున్న పరిణామాలను స‌దరు చిన్నారి గమనిస్తున్న తీరు, ప్రజల బాగోగులపై త‌న‌కున్న‌ తపన చాలా ఆకట్టుకుందని చెప్పారు. చిన్న వయసులోనే సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవడం సంతోషకరమన్నారు. దేశ నిర్మాణంలో భాగమయ్యే ఒక బాధ్యతాయుతమైన, అప్రమత్తత కలిగిన పౌరురాలిగా ఆ చిన్నారి ఎదుగుతుంద‌ని త‌న శుభాశీస్సులు అంద‌జేశారు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.

Also Read: మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం విడిచింది.. ఊర‌ట‌నిస్తున్న కొత్త కేసులు, రిక‌వ‌రీలు

తూర్పుగోదావరి జిల్లాలో ఒంటరి మహిళపై దుండ‌గుల అత్యాచారయత్నం.. ఆమె గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో